సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల అరెస్ట్.. మెగా ఫ్యాన్స్ స్పందనిదే!

ABN, Publish Date - Apr 15 , 2026 | 04:54 PM

ఇటీవల మెగా ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిహారిక‌లతో పాటు గతంలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి వారిపై స్టాండప్ కామెడీ పేరుతో కమెడియన్ అనుదీప్ కటికాల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Stand-up Comedian Anudeep Katikala

ఇటీవల మెగా ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan), నిహారిక‌ (Niharika)లతో పాటు గతంలో నారా లోకేష్ (Nara Lokesh), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వంటి వారిపై స్టాండప్ కామెడీ పేరుతో కమెడియన్ అనుదీప్ కటికాల (Anudeep Katilala) అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులపై అనుదీప్ కటికాల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన పార్టీ నేత బడే వెంకట కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో కాకినాడ వన్ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో హైదరాబాద్‌కు చెందిన అనుదీప్‌పై కేసు నమోదైంది. దీంతో పోలీసులు అతడ్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగగా, అతను పరారీలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, పోలీసులు అన్నివైపులా గాలింపు చర్యలు చేపట్టడంతో.. వారికి అనుదీప్ దొరికేశాడు.


అనుదీప్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నట్లుగా గుర్తించి, వెంటనే అప్రమత్తం అయ్యారు. ప్రయాగ్‌రాజ్‌లోని తన తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్లిన అనుదీప్, అక్కడే ఓ పార్కులో ఉండగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయనని కస్టడీలోకి తీసుకున్నారు. ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మెగా ఫ్యామిలీ అనే కాదు.. ఇకపై ఏ ఫ్యామిలీపై కామెంట్ చేయాలన్నా.. భయపడే విధంగా ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజమే, స్టాండప్ కామెడీ పేరిట ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తామంటే ఎవరూ ఊరుకోరు.


ఒక లిమిట్ వరకు ఓకే కానీ, అది క్రాస్ చేస్తే ఎలా ఉంటుందో.. అనుదీప్‌పై తీసుకునే చర్యల ద్వారా.. అలాంటి వారందరికీ తెలియాలంటూ, ఈ అరెస్ట్‌పై నెటిజన్లు రియాక్ట్ అవుతుండటం విశేషం. అనుదీప్ విషయానికి వస్తే, మెగా ఫ్యామిలీలోని వారిని కావాలని టార్గెట్ చేసినట్లుగా ఆయన షోలో కామెడీ చేశారు. పవన్ కళ్యాణ్, నిహారిక, రామ్ చరణ్, ఉపాసన.. ఇలా వారందరిపై చిల్లర కామెడీ చేసి, అడ్డంగా దొరికేశాడు. ఇంతకు ముందు బాలయ్య, నారా లోకేష్ వంటి వారిని కూడా టార్గెట్ చేస్తూ, ఆయన లిమిట్స్ క్రాస్ చేశాడు. అందుకే, అనుదీప్‌కు ఇచ్చే ట్రీట్‌మెంట్‌తో ఇకపై ఇలాంటి వాటికి చెక్ పడేలా ఉండాలని మెగా ఫ్యాన్స్, నెటిజన్లు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

దేవుడిచ్చిన బాడీని.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయడానికి వాడుతున్నా! - విష్ణుప్రియ

అమ్మాయిలు చూస్తున్నారని, నాన్న కొడుతున్నా పారిపోలేదు -రాజశేఖర్

అన్నీ ఉన్నాయ్ కానీ.. అన్నా లెజినోవా షాకింగ్ పోస్ట్!

షూటింగ్ బ్రేక్‌లో పాయల్ రాజ్‌పుత్ చేసే పనులివా?

‘చిరంజీవి’కి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Updated Date - Apr 15 , 2026 | 04:54 PM