Pawan Kalyan - Federation fight: ఉస్తాద్‌ షూటింగ్‌ ఆపడానికి కారణమదే..

ABN , Publish Date - Aug 04 , 2025 | 03:13 PM

సోమవారం నుంచి పవన్‌ కల్యాణ్‌ షూటింగ్‌కు హాజరు కావలసి ఉంది. అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో వేసిన సెట్‌లో చిత్రీకరణ ప్లాన్‌ చేశారు. ఓ పాటను ముంబై డాన్సర్స్‌ రిహార్సెల్‌ మొదలుపెట్టారు.

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (harish Shankar) తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రాశీఖన్నా, శ్రీలీల కథానాయికలు. ఇటీవల  రాశీఖన్నా సెట్‌లో అడుగుపెట్టారు. సోమవారం నుంచి పవన్‌ కల్యాణ్‌ షూటింగ్‌కు హాజరు కావలసి ఉంది. అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో వేసిన సెట్‌లో చిత్రీకరణ ప్లాన్‌ చేశారు. ఓ పాటను ముంబై డాన్సర్స్‌ రిహార్సెల్‌ మొదలుపెట్టారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను ఆపేశారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన చెర్రీ తో వాగ్వాదానికి దిగారు. ఫుడ్‌ తీసుకొస్తున్న ప్రొడక్షన్‌ వెహికల్‌ను నిలిపేసి డ్రైవర్‌పై చేసుకున్నారు కొందరు కార్మికులు. ‘నువ్వు నిర్మాత అయితే మాకేంటి.. ఫెడరేషన్‌ కండీషన్లకు (Federation fight) అంగీకరించి షూటింగ్‌ చేసుకోండి.. మాకేం సమస్య ఉండదు అంటూ చెర్రీపై విరుచుకుపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.


అసలు ఏం జరిగిందంటే.. వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సోమవారం నుంచీ షూటింగ్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ తరుణంలో ముంబై నుంచి సినీ కార్మికులను తెప్పించి షూటింగ్‌ నిర్వహించడమేంటని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థపై మండిపడుతున్నారు ఫెడరేషన్‌ మెంబర్స్‌. తెలుగు సినీ కార్మికుల కష్టం హీరో పవన్‌ కళ్యాణ్‌గారికి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు కార్మికులు.


ALSO READ: Pushpa Craze: 'ఏజీటీ సీజన్‌ 20'లో పుష్ప బీజీఎం.. ఊగిపోయారంతే..

Tamannaah Bhatia: ఆ రూమర్స్‌ ఎలా వస్తాయో.. ఎందుకు క్రియేట్‌ చేస్తారో..

Mahavatar Narsimha: వంద కోట్ల క్లబ్ లో...

Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ నిర్మాతతో ఫెడరేషన్‌ వాగ్వాదం.. రిహార్సల్ ఆగిపోయింది 

Viral Vayyari: షేక్‌ చేసిన వయ్యారి.. ఫుల్‌ వీడియో చూసేయండి..

Updated Date - Aug 04 , 2025 | 03:29 PM