Pawan Kalyan : పవర్‌ప్యాక్డ్‌ సన్నివేశాలతో...

ABN , First Publish Date - 2023-09-07T15:19:59+05:30 IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మంచి జోరు మీదున్నారు. తాజాగా ‘ఓజి’ చిత్రం నుంచి హంగ్రీ చీతా పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే! దాంతో అభిమానులు కూడా మాంచి జోష్‌లో ఉన్నారు. తాజాగా అభిమానులకు మరో క్రేజీ అప్‌డేట్‌ అందింది.

Pawan Kalyan : పవర్‌ప్యాక్డ్‌ సన్నివేశాలతో...

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (pawan kalyan) మంచి జోరు మీదున్నారు. తాజాగా ‘ఓజి’ చిత్రం నుంచి హంగ్రీ చీతా పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే! దాంతో అభిమానులు కూడా మాంచి జోష్‌లో ఉన్నారు. తాజాగా అభిమానులకు మరో క్రేజీ అప్‌డేట్‌ అందింది. ఇప్పటి వరకూ వారాహి విజయ యాత్ర మూడో విడత పూర్తి చేసుకున్న ఆయన మళ్లీ సెట్‌లో సందడి చేయనున్నారు. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సెట్‌లో అడుగుపెట్టనున్నారు పవన్‌. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అప్‌డేట్‌ ఇచ్చింది. రెండ్రోజుల ముందే ప్రారంభం కావలసిన షూటింగ్‌ వర్షాల కారణంగా ఆగింది. (Ustaad Bhagat singh)

'ఉస్తాద్‌’ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు అంటూ మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ గన్‌ పట్టుకోని, చైర్‌లో కూర్చోని చాలా మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘‘పవన్‌కల్యాణ్‌ సెట్‌లో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం జరగబోయే మాసీవ్‌ షెడ్యూల్‌ పవర్‌ప్యాక్డ్‌ సీన్స్‌ తెరకెక్కించనున్నాం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్‌ సరసన శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రానికి హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-09-07T15:19:59+05:30 IST