సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కావ్య మారన్‌తో పెళ్లి.. తెలుగువాళ్లకి అనిరుధ్ మరింత దగ్గర కాబోతున్నాడా?

ABN, Publish Date - Oct 17 , 2026 | 10:40 AM

సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్.. సన్ గ్రూప్ వారసురాలు, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈవో కావ్య మారన్ పెళ్లిపీటలెక్కబోతున్నారు. అందుకు సంబంధించిన పెళ్లి పిలుపులు మొదలయ్యాయి.

Kavya Maran and Anirudh

సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander).. సన్ గ్రూప్ వారసురాలు, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈవో కావ్య మారన్ (Kavya Maran) పెళ్లిపీటలెక్కబోతున్నారు. గత కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టగా.. తాజాగా వివాహ ఆహ్వానాలు మొదలవడంతో ఈ క్రేజీ పెళ్లికి సంబంధించిన విషయం అధికారికంగా స్పష్టమైంది. సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి మారన్ హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తమ కుమార్తె కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు స్వయంగా ఆహ్వానించారు. దీంతో కావ్య, అనిరుధ్‌ల వివాహానికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు మొదలయ్యాయి.

తాజా సమాచారం ప్రకారం నవంబర్ 11న యూరప్‌లోని గ్రీస్‌లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ అత్యంత వైభవంగా జరగనుందని తెలుస్తోంది. నవంబర్ 21 చెన్నై వేదికగా సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.


కట్నంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. జోరుగా ప్రచారం!

ఈ పెళ్లి కబురుతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో, నెట్టింట మరో సంచలన అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పెళ్లికి కానుకగా ఐపీఎల్‌లో తెలుగు జట్టుగా కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఫ్రాంచైజీ బాధ్యతలను అనిరుధ్‌కు అప్పగించనున్నారనే చర్చ జోరుగా వినిపిస్తోంది. అయితే దీనిపై మారన్ కుటుంబం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. ఈ ప్రచారం మాత్రం క్రికెట్, సినీ సర్కిల్స్‌లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే తెలుగులో ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘దేవర’, ‘ద ప్యారడైజ్’ వంటి చిత్రాలకు బ్లాక్‌బస్టర్ చార్ట్‌బస్టర్ సాంగ్స్ అందించి.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అనిరుధ్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అయితే, ఒకవేళ నిజంగానే ఎస్ఆర్‌హెచ్ టీమ్ బాధ్యతలు ఆయన చేతుల్లోకి వస్తే.. ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత భావోద్వేగంగా చేరువయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ అభిమానులకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అనేది కేవలం ఒక ఐపీఎల్ జట్టు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్! మ్యాచ్ జరిగిన ప్రతిసారీ ఉప్పల్ స్టేడియంలో సందడి చేస్తూ కనిపించే కావ్య మారన్‌తో పాటు, ఇకపై అనిరుధ్ కూడా ఆరెంజ్ ఆర్మీ బాధ్యతలను భుజాన వేసుకుంటే.. తెలుగు వాళ్లు ఆయనను మరింత సొంతం చేసుకోవడం ఖాయం. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగితే ఒకవైపు క్రికెట్ జోష్.. మరోవైపు అనిరుధ్ బీట్స్ తోడైతే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో అనిరుధ్-కావ్య మారన్ జంట నవంబర్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుండగా, ఈ ఎస్ఆర్‌హెచ్ ప్రచారంపై రాబోయే రోజుల్లో ఎలాంటి అధికారిక స్పష్టత వస్తుందో చూడాలి!

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’లో నాకు బాగా నచ్చిన సీన్ అదే: రామ్ చరణ్

ఆర్ నారాయణమూర్తి గురించి అంతా తెలుసుకోవాలి: శ్రీవిష్ణు

Ramayana: జీవీ ప్రకాశ్‌కు ఏఆర్ రెహమాన్ పిలుపు.. ఎందుకో తెలుసా?

Updated Date - Oct 17 , 2026 | 11:18 AM