‘పెద్ది’లో నాకు బాగా నచ్చిన సీన్ అదే: రామ్ చరణ్

ABN , Publish Date - Oct 17 , 2026 | 10:22 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రామ్ చరణ్ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

Ram Charan about Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi) వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ‘పెద్ది’ హిందీ వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అక్టోబర్ 25న రాత్రి 8:00 గంటలకు ప్రముఖ హిందీ మూవీ ఛానల్ ‘సోనీ మాక్స్’ (Sony Max)లో ప్రసారం కానుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం త్వరలోనే బుల్లితెర వీక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్ అనుభవాలు, సినిమాలో తనకు అత్యంత సవాలుగా నిలిచిన, మనసుకు హత్తుకున్న సన్నివేశాల గురించి పంచుకున్న వివరాలు సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


‘పెద్ది’లో అత్యంత మెమరబుల్ సీక్వెన్సెస్ గురించి చరణ్ మాట్లాడుతూ.. ‘‘సినిమాలో కేవలం ఒకట్రెండు సీన్లు అని చెప్పలేను, చాలా సన్నివేశాలు ఉన్నాయి. క్రికెట్‌తో ముడిపడి ఉన్న సీన్లు, అలాగే రెజ్లింగ్ (కుస్తీ) సీన్లు చాలా ఉన్నాయి. అయితే నా దృష్టిలో అత్యంత ఆసక్తికరమైన సన్నివేశం క్రికెట్ వేలం ఎపిసోడ్. అందులో మ్యాచ్ ఆడేందుకు హీరో పాత్రను కేవలం ఒక్క రూపాయికే వేలం పాడతారు. ఆ సమయంలో అతని చుట్టూ నడిచే డ్రామా, ఆ తర్వాత అతను ఎలా గుర్తింపు సాధించాడనే సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. ఇక రెజ్లింగ్ సన్నివేశాలు కూడా చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి. సర్వస్వం కోల్పోయిన తర్వాత హీరో తన గురువు వద్దకు వెళ్లి తనకు శిక్షణ ఇవ్వాలని వేడుకునే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రాణంగా నిలిచాయి’’ అని వివరించారు.


ఇక కుస్తీ పోటీల్లో ఇకపై తను పాల్గొనలేనని ‘పెద్ది’ గ్రహించే అత్యంత భావోద్వేగ సన్నివేశం చిత్రీకరణ గురించి చరణ్ ఆసక్తికర విషయం వెల్లడించారు.. ‘‘ఆ సీన్ చేయడం ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించింది, కానీ కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే ఆ సమయానికి నాతో సహా నటీనటులందరం ఆ పాత్రల్లో పూర్తిగా లీనమైపోయాం. ఆ సీక్వెన్స్‌ను ఎలా ప్లాన్ చేయాలనే దానిపై మా డైరెక్టర్ ఎన్నో రోజుల పాటు ఆలోచించి పక్కాగా సిద్ధం చేసుకున్నారు. అయితే యూనిట్ సభ్యులందరి పూర్తి సహకారంతో ఆ సన్నివేశాన్ని కేవలం ఒకే రోజులో, కేవలం 8 గంటల వ్యవధిలోనే పూర్తి చేయగలిగాం. వ్యక్తిగతంగా నా మనసుకు ఎంతో దగ్గరైన సన్నివేశాల్లో ఇది కూడా ఒకటి’’ అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

ఆర్ నారాయణమూర్తి గురించి అంతా తెలుసుకోవాలి: శ్రీవిష్ణు

Ramayana: జీవీ ప్రకాశ్‌కు ఏఆర్ రెహమాన్ పిలుపు.. ఎందుకో తెలుసా?

ఆ విషయంలో హీరోయిన్లకు మినహాయింపు లేదు: ‘బ్లాస్ట్’ బ్యూటీ

Updated Date - Oct 17 , 2026 | 10:22 AM

Peddi Review: రామ్‌చరణ్‌ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం 'పెద్ది’ ఎలా ఉందంటే..

Peddi Action Sequence:రామ్ చరణ్ 'పెద్ది' రిస్క్..

Peddi - Ram Charan:  పెద్ది కోసం రామ్ చరణ్ ఫిట్‌నెస్‌ మిషన్‌

Peddi First Shot: రామ్ చరణ్ చెప్పినట్టే ఫస్ట్ షాట్ అదిరింది

Peddi Movie: ట్రైలర్‌లోని ఆ షాట్‌కు.. నీకు గుడి కట్టేయవచ్చు బుచ్చి!