Anirudh Ravichander: సన్ రైజర్స్ జట్టు ఓనర్ కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన టీమ్
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:25 PM
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Anirudh Ravichander: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ లో తన సత్తా చాటుకున్న అనిరుధ్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలను లైన్లో పెట్టి ఇక్కడ కూడా నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ప్రస్తుతం అనిరుధ్.. తెలుగులో కింగ్డమ్(Kingdom) సినిమాకు మ్యూజిక్ ను అందిస్తున్నాడు.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. అనిరుధ్ కెరీర్ ను ప్రారంభించిన దగ్గరనుంచి.. అతనికి ఎవరో ఒక స్టార్ తో ప్రేమ వార్తలు ముడిపెడుతూనే వస్తున్నారు. కోలీవుడ్ హీరోయిన్ కమ్ సింగర్ ఆండ్రియా జెర్మియా(andrea jeremiah) తో అనిరుధ్ ప్రేమాయణం నడిపాడని అందరికీ తెలుసు. ఆమెతో విడిపోయాకా, చాలామంది హీరోయిన్స్ తో అనిరుధ్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. సింగర్ జోనితా గాంధీ(Jonitha Gandhi), హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) ఇలా రకరకాలుగా అతడిపై పుకార్లు షికార్లు చేశాయి.
Nani: టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ ని ప్రశంసించిన న్యాచురల్ స్టార్
తాజాగా సన్ రైజర్స్ క్రికెట్ టీమ్ ఓనర్ కావ్య మారన్(Kavya Maaran) తో అనిరుధ్ రిలేషన్ లో ఉన్నాడని, ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. కావ్య మారన్.. సన్ రైజర్స్ టీమ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. ప్రతి మ్యాచ్ లో ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాలి.
గత కొన్నేళ్లుగా అనిరుధ్ - కావ్య మారన్ సీక్రెట్ గా ప్రేమలో ఉన్నారని, ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారని కోలీవుడ్ లో వార్తలు కోడై కూస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలను అనిరుధ్ వ్యక్తిగత టీమ్ కొట్టిపడేసింది. కావ్యతో అనిరుధ్ పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అనిరుధ్ - కావ్య ఇద్దరు మంచి స్నేహితులు మాత్రమే అని, ఎప్పుడైనా కలిసి మాట్లాడడమే తప్ప వారిమధ్య ఎలాంటి రిలేషన్ లేదని తెలిపింది. దీంతో ఈ వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అన క్లారిటీ వచ్చింది.