ఆర్ నారాయణమూర్తి గురించి అంతా తెలుసుకోవాలి: శ్రీవిష్ణు
ABN , Publish Date - Oct 17 , 2026 | 09:52 AM
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు నవ్వుల బ్లాక్‌బస్టర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. ఈ మూవీ సక్సెస్ మీట్లో హీరో శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu) నవ్వుల బ్లాక్‌బస్టర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan). జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పించగా.. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం దసరా ఫన్ డగ బ్లాక్ బస్టర్ మీట్ పేరుతో ఓ వేడుకను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ను ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ పేరుపేరునా థాంక్స్. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కృష్ణ ప్రొడ్యూసర్ కంటే నాకు చాలా మంచి ఫ్రెండ్ అయిపోయారు. మేము అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. ఈ సినిమాను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కోన వెంకట్‌తో పనిచేయడం, ఆయన అనుభవాన్ని షేర్ చేసుకోవడం నాకు చాలా హెల్ప్ అయింది. ఆయన అన్ని కోణాల్లో ఆలోచిస్తారు కాబట్టే ఇన్ని సినిమాలు చేయగలిగారు. డైరెక్టర్ జానకితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. భాస్కరభట్ల అన్ని పాటలను ఫెంటాస్టిక్‌గా రాశారు. ఆయన చెప్పినట్టుగానే ఈ ఆడియో చాలా పెద్ద సక్సెస్ అయింది. పృథ్వీ యాక్షన్ ఎపిసోడ్‌ను చాలా అద్భుతంగా చేశారు. సుదర్శన్‌తో నా కెమిస్ట్రీ ఎప్పుడూ బాగుంటుంది.
సత్య గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాలి. తను లేకపోతే ఈ సినిమా లేదనే చెప్పాలి. తను అద్భుతంగా చేశాడు. ఆ పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నారాయణమూర్తి (R. Narayana Murthy) సార్‌ని అవసరం వచ్చినప్పుడు తెరమీద చూపించడం మనందరి బాధ్యత. ఆయన గురించి మనందరం తెలుసుకోవాలి. అంత గొప్ప లెజెండ్ ఆయన. ఈ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఫస్ట్ రివ్యూ ఇచ్చింది హరీష్ శంకర్. ఈ సినిమా గ్యారెంటీగా వర్కవుట్ అవుతుందని చెప్పారు. ఆయన నమ్మకం నిజమైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలా నవ్వులతో కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Ramayana: జీవీ ప్రకాశ్‌కు ఏఆర్ రెహమాన్ పిలుపు.. ఎందుకో తెలుసా?
ఆ విషయంలో హీరోయిన్లకు మినహాయింపు లేదు: ‘బ్లాస్ట్’ బ్యూటీ
జనవరి 12న విడుదల.. అనిల్ రావిపూడి, నీ చర్యలు ఊహాతీతం