Anirudh Ravichander: సింగర్‌తో చెట్టాపట్టాలు... మరోసారి వార్తలో సంగీత దర్శకుడు!

ABN , First Publish Date - 2023-07-10T10:55:34+05:30 IST

కొలవెరి డి’ పాట వినగానే గుర్తొచ్చే పేరు అనిరుధ్‌ రవిచంద్రన్‌. ధనుష్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘త్రీ’లోని పాట అది. ఈ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్‌ ఆ పాటతో ఎంతగా పాపులర్‌ అయ్యాడో తెలిసిందే. హీరో ధనుష్‌ ఆ పాటను తనదైన శైలిలో పాడి అలరించారు. తాజాగా ఆయన చుట్టూ మరో వివాదం రేగుతుంది. ‘బీస్ట్‌’ సినిమాలో ‘అరబిక్‌ కుత్తు’ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సింగర్‌ ‘జోనితా గాంధీ’తో అనిరుద్‌ ఎఫైర్‌ నడుపుతున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది.

Anirudh Ravichander: సింగర్‌తో చెట్టాపట్టాలు... మరోసారి వార్తలో సంగీత దర్శకుడు!

'కొలవెరి డి’ (Kolaveri d)పాట వినగానే గుర్తొచ్చే పేరు అనిరుధ్‌ రవిచంద్రన్‌(Anirudh Ravichander). ధనుష్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘త్రీ’లోని పాట అది. ఈ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్‌ ఆ పాటతో ఎంతగా పాపులర్‌ అయ్యాడో తెలిసిందే. హీరో ధనుష్‌ ఆ పాటను తనదైన శైలిలో పాడి అలరించారు. 20 ఏళ్ల కుర్రాడు కొట్టిన సంగీతం పదేళ్ల క్రితం ఓ సంచలనంగా మారింది. ఆ పాటతో అనిరుధ్‌ ‘కొలవెరి బుడ్డొడు’గా గుర్తింపు పొందాడు. అక్కడి నుంచి అతను తమిళ చిత్రాలతోనే కాకుండా తెలుగులోనూ చక్కని అవకాశాలు అందుకుంటూ సక్సెస్‌గా ముందుకెళ్తున్నాడు. ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఆ సినిమా హిట్‌ కాకపోయిన అనిరుధ్‌ మ్యూజిక్‌ మాత్రం హిట్టే. ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఈ యువ సంగీత దర్శకుడిపై పలు విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో కోలీవుడ్‌లో సుచీ లీక్స్‌ పేరుతో పలు ఫొటోలో బయటకు వచ్చాయి. హీరోయిన్‌ ఆండ్రియాతో అనిరుద్‌ డీప్‌ లిప్‌లాక్‌ పెట్టుకుంటున్న ఫొటో లీక్‌ అయ్యింది. సినీ పరిశ్రమలో అది పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత ఈ విషయంపై ఆండ్రియా ఖండించింది. అక్కడితో ఆ ఇష్యూకి ఫుల్‌స్టాప్‌ పడింది. అయినా అనిరుధ్‌పై విమర్శలు మాత్రం తగ్గలేదు. ఎవరో ఒక సింగర్‌తో సంబంధం ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన చుట్టూ మరో వివాదం రేగుతుంది. ‘బీస్ట్‌’ సినిమాలో ‘అరబిక్‌ కుత్తు’ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సింగర్‌ ‘జోనితా గాంధీ’(Jonita gandhi)తో అనిరుద్‌ ఎఫైర్‌ నడుపుతున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. కొన్నిరోజులుగా వారిద్దరూ కలిసే తిరుగుతున్నారని టాక్‌. (love Affair)

1.jpg

కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమా నుంచే వీరిద్దరూ డీప్‌ లవ్‌లో ఉన్నారని సమాచారం. అనిరుధ్‌ ఎక్కడ ఉంటే జోనితా కూడా అక్కడే కనిపిస్తోందని చెబుతున్నారు. వీళ్లిద్దరి ఫొటోలు నెట్టంట హల్‌చల్‌ చేస్తున్నాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా టాక్‌ నడుస్తోంది. అయితే దీనిపై ఈ జంట ఎక్కడా స్పందించలేదు. అభిమానులు మాత్రం మాకు నిజం తెలియాలి అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం అనిరుధ్‌ ‘జైలర్‌’, దేవర, లియో, ఇండియన్‌2, వీడీ12 తదితర చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. జోనితా గాంధీ తెలుగులో ఎన్నో హిట్‌ పాటలు పాడింది. మహేశ్‌ ‘సర్కారు వారి పాట’ చిత్రంలో ‘మజజమజ మహేశా’ పాట ఆమె పాడింది.

Updated Date - 2023-07-10T10:55:34+05:30 IST