సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అల్లు అయాన్‌కు ఆర్‌సీబీ ప్లేయర్ స్పెషల్ గిఫ్ట్.. బన్నీ పోస్ట్ వైరల్!

ABN, Publish Date - May 23 , 2026 | 07:15 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను భారత యువ క్రికెటర్, ఐపీఎల్ స్టార్, ఆర్‌సీబీ జట్టు మెంబర్ వెంకటేష్ అయ్యర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు.

Venkatesh Iyer Meets Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun)ను భారత యువ క్రికెటర్, ఐపీఎల్ స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మెంబర్ వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టాలెంటెడ్ యంగ్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందంటూ బన్నీ ఒక ప్రత్యేక పోస్ట్‌ను పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా, క్రికెట్ ప్రపంచానికి చెందిన ఇద్దరు స్టార్స్ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో నటుడి అభిమానులతో పాటు.. క్రికెట్ లవర్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.


ఈ మీట్‌లో ఒక ఆసక్తికరమైన ముచ్చట జరిగింది. అల్లు అర్జున్ కుమారుడైన అల్లు అయాన్‌ (Allu Ayaan)కు వెంకటేష్ అయ్యర్ ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తను స్వయంగా సంతకం చేసిన స్పెషల్ క్రికెట్ ఆర్‌సీబీ జెర్సీని అయాన్‌కు బహుమతిగా అందించారు. తన కొడుకు కోసం ఇంతటి ప్రత్యేకమైన కానుకను తెచ్చినందుకు వెంకటేష్ అయ్యర్‌కు బన్నీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఫోటోలో అయాన్ ఆ జెర్సీని పట్టుకుని ఎంతో మురిసిపోతూ నవ్వుతూ కనిపించగా, పక్కనే అల్లు అర్జున్‌తో పాటు ఇండస్ట్రీకి చెందిన మరికొందరు ఆయన షేర్ చేసిన ఫొటోలో ఉన్నారు.


క్రికెట్ మైదానంలో తనదైన శైలిలో రాణిస్తున్న వెంకటేష్ అయ్యర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆయన కెరీర్ అద్భుతంగా సాగాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. ‘విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్’ అంటూ బన్నీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ మూవీ ‘రాకా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, ఇలా క్రికెట్ స్టార్‌తో సమయం గడపడం, ఇలా ఎక్స్ వేదికగా ఫోటోలు షేర్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి:

40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!

ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున

MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!

అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?

Updated Date - May 23 , 2026 | 07:15 PM