Raaka: అల్లు అర్జున్ ‘రాకా’లో ఆ స్టార్ హీరో!.. అట్లీ, అసలేం చేస్తున్నావయ్యా!

ABN , Publish Date - May 03 , 2026 | 07:24 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రాకా’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి, ఎటువంటి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు

Allu Arjun Raaka Update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రాకా’ (Raaka). రీసెంట్‌గానే ఈ మూవీ టైటిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి, ఎటువంటి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు. మరీ ముఖ్యంగా ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రమిది. అందుకే, ‘రాకా’కు సంబంధించి ఏ చిన్న విషయం వచ్చినా పాన్ ఇండియా స్థాయిలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా సర్కిల్స్‌లో బాగా సంచారం చేస్తోంది.


ఆ వార్త ఏమిటంటే.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, అక్షయ్ కుమార్ కోసం అట్లీ ఓ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశాడనేలా మాత్రం టాక్ నడుస్తోంది. మరి ఈ టాక్‌పై చిత్రయూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది. మరో వైపు ఇప్పటికే ఇందులో షారుఖ్ ఖాన్ నటిస్తోన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అక్షయ్ పేరు వినబడగానే, అట్లీ ఏదో గ్రాండ్‌గానే ప్లాన్ చేస్తున్నాడంటూ టాక్ మొదలైంది. అక్షయ్ కుమార్ విషయానికి వస్తే.. ఇంతకు ముందు ‘కన్నప్ప’ వంటి చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ చిత్రంలో అంటే, ఆయనకు కూడా తెలుగులో మంచి గుర్తింపు వచ్చే అవకాశం లేకపోలేదు. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.


ఇక అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్ లుక్‌.. ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి వారు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి మా హీరో రికార్డులు బద్దలు కొడతాడంటూ.. ఇతర హీరోల ఫ్యాన్స్‌కు సవాల్ విసురుతున్నారు.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?

ఒకే వేడుకలో చైతూ-శోభిత, సమంత-రాజ్ జంటలు హల్చల్!

‘నా పెళ్ళాం నిప్పు రా’.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!

కయాదు లోహర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Updated Date - May 03 , 2026 | 07:24 PM

Allu Arjun - Atlee: అల్లు అర్జున్‌ కసి అదే.. పెద్ద ప్లానే ఇది...

Allu Arjun - Atlee: అల్లు అర్జున్‌.. అట్లీ.. ఓ అతిథి..  

Allu Arjun - Atlee: కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం.. ఒక రేంజ్‌లో ఉంటుంది..

Allu Arjun - Atlee: దీపికానే ఫైనల్!

Allu Arjun - National Awards : నేషనల్‌ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ఏమన్నారంటే..!