Allu Arjun - Atlee: అల్లు అర్జున్‌.. అట్లీ.. ఓ అతిథి..  

ABN , Publish Date - May 20 , 2025 | 03:39 PM

‘ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu arjun) హీరోగా తమిళ దర్శకుడు అట్లీ  ఓ  సినిమా తెరకెక్కించనున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

‘ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu arjun) హీరోగా తమిళ దర్శకుడు అట్లీ  ఓ  సినిమా తెరకెక్కించనున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో ఓ డాన్‌ చుట్టూ ఈ కథా సాగుతుందని టాక్‌. దర్శకుడు, హీరో ఇప్పటికే కథా చర్చలు, ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెట్టారు. ఇందులో బన్నీ పాత్ర మూడు డిఫరెంట్‌ యాంగిల్స్‌లో ఉంటుందని టాక్‌ నడుస్తోంది. బన్నీ నెగటివ్‌ షేడ్‌లో కనిపిస్తారని గాసిప్పులు వచ్చాయి.

Sharukh.jpg

ఇప్పుడు మరో క్రేజీ అప్‌ డేట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా అతిథి పాత్రలను డిజైన్‌ చేస్తున్నాడట. జైలర్‌ సినిమాలో రజినీకాంత్‌ సరసన శివరాజ్‌కుమార్‌, మోహన్‌ లాల్‌ ఎలా మెరిశారో.. అదే శైలిలో ఈ సినిమాలో కూడా రెండు పవర్‌ ఫుల్‌ గెస్ట్‌ రోల్స్‌ ను ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. అయితే ఆ పాత్రల కోసం ఎవర్ని అప్రోచ్‌ అవుతారనేది తెలియాల్సి ఉంది.  అయితే నెట్టింట వైరల్‌ అవుతున్న న్యూస్‌ ప్రకారం షారుఖ్‌ ఖాన్‌ ఓ గెస్ట్‌ రోల్‌లో కనిపిస్తారట. సన్‌ పిక్చర్స్‌ వారు సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలో చిత్రీకరణ మొదలు కానుంది.  

Updated Date - May 20 , 2025 | 03:39 PM