సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!

ABN, Publish Date - Jun 04 , 2026 | 10:02 PM

పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌కు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. బండ్ల దారిలోనే నటి హేమ కూడా ప్రకాష్ రాజ్‌కు ఇచ్చిపడేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.

Actress Hema and Prakash Raj

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (AP Deputy CM Pawan Kalyan)ని ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసిన ట్వీట్‌కు.. నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఏ విధంగా కౌంటర్ ఇచ్చారో తెలియంది కాదు. కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ విషయంలో బండ్ల గణేష్ మరిగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తిని విమర్శించే స్థాయి లేని వాడు కూడా మైక్ పట్టుకుని ఏవేవో కూస్తున్నాడనే భావనలో ఉన్న బండ్ల గణేష్.. ఇక తన ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు. నటుడు ప్రకాష్ రాజ్‌కు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చి.. తను ఎంతగా కంట్రోల్ చేసుకుంటున్నాడనేది తెలియజేశారు. ఇప్పుడు నటి హేమ (Actress Hema) కూడా.. ప్రకాష్ రాజ్‌కు ఇచ్చిపడేశారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియోలో..


‘‘హలో ప్రకాష్ రాజ్ గారు.. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూశా. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని ‘దొర’ అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో ‘దొర’ అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడతారో మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ.. వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి, ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ, కోట్ల మంది ప్రజలకి తెలుసు.


మీరు చదవరు కదా, గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది. మీతో నేను చాలా సినిమాలు భార్యగా యాక్ట్ చేశాను. మీరు ఈరోజు షూటింగ్‌కి వస్తానని డేట్ ఇస్తారు. మేమందరం పొద్దున్నే మేకప్ వేసుకుని, రెడీ అయిపోయి కూర్చుంటాం. ఇంకా వస్తారు, ఇంకా వస్తారు, పది నిమిషాల్లో వస్తారు, గంటలో వస్తారు, లంచ్ తర్వాత వస్తారు.. ఇట్లా ఇట్లా అంటారు. మీకు యాక్ట్ చేసే మూడ్ లేక ‘నేను వేరే కంట్రీ వెళ్ళిపోయాను’ అంటారు. కనీసం వేరే కంట్రీ వెళ్ళే ముందు ఎవరికీ ఫోన్ చేసి చెప్పడం గానీ, ప్రొడ్యూసర్‌కి గానీ, డైరెక్టర్‌కి గానీ చేయరు. నేను కూడా చాలా సార్లు అడిగాను.. ‘సర్, మీ వల్ల మేము సఫర్ అవుతున్నాము, మీరెందుకు ఇలా చేస్తున్నారు?’ అంటే.. ‘నాకు మూడ్ లేదురా యాక్ట్ చేయడానికి, అందుకే నేను ఆ కంట్రీ వెళ్ళిపోయాను, ఈ ప్రాంతం వెళ్ళిపోయాను’ అని చెప్తారు. మరి మీరు నాకు ఒకటి చెప్పండి.. రాజకీయాల్లోకి మీరు సింగిల్‌గా వస్తారా? గుంపులతో వస్తారా? మీకు రాజకీయాలు చేసి ప్రజాసేవ చేసే మూడ్‌లో ఉన్నారా? లేదా? దయచేసి ఒకసారి చెప్పండి సర్’’.. అంటూ ప్రకాష్ రాజ్‌ని హేమ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!

‘డ్రాగన్’లోని ఆ సంచనాల కోసం వెయిటింగ్ -ఎన్టీఆర్

త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్‌ప్రైజ్‌

Updated Date - Jun 04 , 2026 | 10:04 PM