Prakash Raj: కోట శ్రీనివాస రావు.. అందరికీ నచ్చడు
ABN , Publish Date - Jul 13 , 2025 | 10:34 AM
కోట శ్రీనివాస రావు మృతిపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన సంతాపం తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao) మృతిపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) తన సంతాపం తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట గారి సినిమాలు చూసి చాలా స్పూర్తి పొందానని, ఎన్నో సినిమాల్లో కలిసి నటించామని ఆయన ఎంతో విశిష్డ మైన వ్యక్తి అని.. అందరికీ నచ్చడు.. ఎవరిని మెప్పించటానికి ప్రయత్నం చేయడని, ఆయనది ఒక ప్రజెన్స్ అని.. తన మాటల్లో ఓ వ్యంగ్యం ఉండేది అన్నారు.
తెలుగు ప్రతిభకు చాన్స్ దొరకటం లేదని అనగానే తొలుత నాకు భాద వేసిందని.. కానీ ఆ తరువాత వారి బాధ నిజమే అని అర్దమయిందన్నారు. ప్రకాష్ రాజ్ తెలుగు వారు కాదు కదా అంటే.. తెలుగు మాట్లాడతాడు.. పరాయివాడు కాదు అనేవారు, నాపై కూడా ఛలోక్తులు విసిరే వారని గుర్తు చేసుకున్నారు. ఈమధ్య ఫోన్ చేశానని, మాతో కలిసి ఓ సినిమా సెట్‌లో గడిపారని, వారి ఇంట్లో జరిగిన పెయిన్ ను బయట ఎక్కడా చూపే వారు కాదని వారి వ్యక్తిత్వం నాకు ఎంతో ఇష్డమని కొనియాడారు.