Actress Hema: ఆ న్యూస్ వలనే మా అమ్మ చనిపోయింది.. ఎమోషనల్ అయిన హేమ

ABN , Publish Date - Nov 23 , 2025 | 04:51 PM

నటి హేమ (Hema) తల్లి కోళ్ల లక్ష్మీ ఇటీవలే మృతి చెందిన విషయం తెల్సిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజోలులో కన్నుమూసింది.

Actress Hema

Actress Hema: నటి హేమ (Hema) తల్లి కోళ్ల లక్ష్మీ ఇటీవలే మృతి చెందిన విషయం తెల్సిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజోలులో కన్నుమూసింది. ఇక తల్లి మరణంతో హేమ కృంగిపోయింది. ఆమె తల్లి మరణానికి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినవారే కారణమని హేమ ఎమోషనల్ అయ్యింది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం వలనే తన తల్లి మరణించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

గతేడాది రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయింది. అయితే అందులో తాను లేను అని, నిజం నిలకడ మీద తెలుస్తుందని హేమ చెప్పుకుంటూ వచ్చింది. కోర్టు లో కేసు కూడా సాగుతూ వచ్చింది. ఇటీవలే ఆమెకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. హేమ నిర్దోషిగా బయటకు వచ్చింది. అయితే ఆ కేసు నుంచి బయటపడినా.. ఆ ఆనందం లేదు అని, తన తల్లికి ఈ విషయం చెప్పడానికి కూడా ఆమె లేదని వాపోయింది.

'ఈ ఫేక్ న్యూస్ వలనే నా తల్లి చనిపోయింది. నేను నిర్దోషిని అని చెప్తూనే వస్తున్నా.. కొన్ని మీడియా ఛానల్స్ నన్ను దోషిని చేసి ఫేక్ న్యూస్ ను చెప్పుకొచ్చాయి. ఆ వార్తలు విని మా అమ్మ ఆరోగ్యం పాడైంది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ మా అమ్మ తట్టుకోలేకపోయింది. నా గురించి ఎంతో బాధపడింది. ఎన్నోసార్లు ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయకండి అని చెప్పాను. వినలేదు. ఇప్పుడు కోర్టు నన్ను నిర్దోషి అని చెప్పింది. కానీ, ఇప్పుడు మా అమ్మ లేదు. మా అమ్మను ఇప్పుడు ఆ న్యూస్ ప్రచారం చేసినవాళ్లు తీసుకురాగలరా.. ? ఏడాదిన్నరగా మానసిక క్షోభను అనుభవిస్తున్నాను' అంటూ కంటనీరు పెట్టుకుంది.

Updated Date - Nov 23 , 2025 | 04:51 PM