Actress Hema: మీ అక్కను బాడీ షేమింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నావ్ మంచు విష్ణు
ABN , Publish Date - Sep 20 , 2025 | 06:55 PM
మంచు వారసురాలు మంచు లక్ష్మీ (Manchu Laxmi)ని ఒక సీనియర్ జర్నలిస్ట్ బాడీ షేమింగ్ చేశాడని, అతడిపై యాక్షన్ తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.
Actress Hema: మంచు వారసురాలు మంచు లక్ష్మీ (Manchu Laxmi)ని ఒక సీనియర్ జర్నలిస్ట్ బాడీ షేమింగ్ చేశాడని, అతడిపై యాక్షన్ తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఆమె నటించిన దక్ష సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూకు వెళ్లిన ఆమెను సదురు జర్నలిస్ట్.. మీరు 50 ఏళ్ళ వయస్సులో చిన్న చిన్న బట్టలు వేసుకొని ఫోటోలు పెట్టేముందు ఎలాంటి కామెంట్స్ వస్తాయి అని అనుకొనే పెడతారా అని అడిగాడు.
ఇక జర్నలిస్ట్ ప్రశ్నకు మంచు లక్ష్మీ కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. ఇదే ప్రశ్న మహేష్ బాబును అడగగలరా.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. మీరే జనాలకు నేర్పిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యింది. అక్కడితో ఆ వివాదం ముగిసింది అనుకుంటే.. మంచు లక్ష్మి నిన్న.. ఆ జర్నలిస్ట్ పై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది. తనను సదురు జర్నలిస్ట్ బాడీ షేమింగ్ చేశాడని తెలుపుతూ.. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఇప్పటివరకు ఫిల్మ్ ఛాంబర్ జర్నలిస్ట్ పై యాక్షన్ తీసుకోలేదని తెలుస్తోంది. ఇక ఈ వివాదంపై నటి హేమ ఫైర్ అయ్యింది. మంచు లక్ష్మీకి మద్దతు పలుకుతూ మంచు విష్ణును స్పందించాల్సిందిగా కోరింది.
' ఇటీవల మీడియా వలన నేను చాలా సఫర్ అవుతున్నాను. మూడు స్టేట్స్ మీడియా జనాలతో నేను పోరాడుతున్నాను. నాలాంటి మూర్ఖురాలు, చదువుకొనిది ఏదైనా తెలియక మాట్లాడొచ్చు అనుకోవచ్చు. మీరు జర్నలిస్ట్ లు.. మీరు బాగా చదువుకున్నారు కదా. అలాంటి ప్రశ్నలు అడగొచ్చా.. ఏది అడగాలి.. ఏది ఆడగకూడదు.. అది నిజమా అబద్దమా.. అనేది ఏమి చూడకుండా మాట్లాడమేనా. మొన్నటికి మొన్న సుమ గారు ఒక ఈవెంట్ లో నవ్వుకుంటూ టిఫిన్స్ ను భోజనం లా చేయకండి అన్నందుకు.. ఇవే తగ్గించుకుంటే మంచింది అని ఆమెతో సారీ చెప్పించుకున్నారు.
కానీ, మీరు మాత్రం మీ నోటికి ఏది వస్తే అది అనేస్తారా.. ? నిజమా అబద్ధం తెలుసుకోకుండా మాట్లాడతారా. ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ లో ఉన్న ఆడవాళ్లు కూడా అవీతిని ఖండించడం లేదు. ఆ జర్నలిస్ట్ కూడా ఒక పదవిలో ఉన్నారు. అలా ఎలా మాట్లాడతాడు. గతంలో ఒక ఆయన.. ఇండస్ట్రీలో ల*** లేరా అని అన్నాడు. దానికి మీరు ఎలా అంటారని అడిగినందుకు హీరోలను, మాపై కేసులు పెట్టారు. మమ్మల్నే కోర్ట్ కి పిలిచారు. అప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్ గారు.. మీడియాతో ఎందుకులే అని కేసులు తీసేశారు.
ఇప్పుడు నేను ఇదే మా అసోసియేషన్ ను అడుగుతున్నాను ఈరోజు మంచు లక్ష్మీ గారికి బాడీ షేమింగ్ గా ఒక యాంకర్ ఒక ప్రశ్న అడిగారు. అది సోషల్ మీడియాలో టెలికాస్ట్ అయ్యింది. మా అసోసియేషన్ ఏం చేస్తుంది. ఒక ప్రెసిడెంట్ గారి అక్కకే ఈ గతి అంటే.. మిగతా మెంబర్స్ పరిస్థితి ఏంటి. ఇప్పటివరకు ఛాంబర్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అక్కడకు పంపించాం.. ఇక్కడకు పంపించాం అని చెప్తుంది. ఆరోజు నా మీద న్యూస్ వచ్చినప్పుడు అది నిజమా అబద్ధమా అనేది కూడా తెలుసుకోకుండా ఎందరో స్పందించారు. విష్ణు బాబు ఏం చేస్తున్నావ్ నువ్వు. ఈరోజు మీ అక్కకు అయ్యింది. రేపు ఇంకొకరికి అవుతుంది.
ఎందుకు పనికిరాని వాళ్ళను తీసుకొచ్చి ఛానెల్ లో కూర్చొపెట్టి సినిమావాళ్లు ఇలా.. సినిమా వాళ్లకు అలా అని న్యూస్ లు వేస్తున్నారు. ఇప్పుడు మీ అక్కకే ఇలా జరిగింది. మా అసోసియేషన్ కు మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇవన్నీ ఉన్నవి మాలాంటి నటీనటులను కాపాడుకోవడం కోసమే కదా. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అనేయడమేనా. గతంలో వేణుస్వామి అనే వ్యక్తి సమంత, నాగ చైతన్య గురించి మాట్లాడారు. వెంటనే జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. సుమ గారి చేత సారీ చెప్పేవరకు మీరు ఊరుకోలేదు.
జర్నలిస్టులు తప్పు చేస్తే సారీ చెప్పారా.. మళ్లీ ఎదురుతిరిగి కేసులు పెడతారా.. ఇది చాలా అన్యాయం. ఇప్పుడే ఇది ఖండించలేదు అంటే చాలా ఎక్కువ అవుతాయి. దీనిపై కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. లేడీ యాంకర్స్ సపోర్ట్ గా నిలబడండి. లక్ష్మీ వద్దు అన్నప్పుడు ఆ ప్రశ్న ఎందుకడిగారు. ఆ తరువాత ఎందుకు టెలికాస్ట్ చేశారు. సినిమా వాళ్లు లోకువ అయ్యిపోయారా.. ? అంటూ హేమ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Mohal Lal: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
Manchu Manoj: ఒక్క సినిమా.. ఏకంగా చిరుకే విలన్ గా మార్చింది