సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Narnia: ‘నార్నియా’ ట్రైలర్.. మాయాజాలంతో మరో అద్భుత ప్రపంచం

ABN, Publish Date - Oct 16 , 2026 | 02:24 PM

ప్రముఖ దర్శకురాలు గ్రెటా గెర్విగ్ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ఫాంటసీ చిత్రం ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ ట్రైలర్ విడుదలైంది.

ప్రముఖ దర్శకురాలు గ్రెటా గెర్విగ్ తెరకెక్కిస్తున్నప్రతిష్ఠాత్మక ఫాంటసీ చిత్రం ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ (Narnia: The Magician's Nephew) ట్రైలర్ విడుదలైంది. మాయాజాలం, సాహసాలు, అద్భుతమైన పాత్రలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. సీ.ఎస్. లూయిస్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ రిలీజింగ్ ఇంటర్నేషనల్ విడుదల చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఈ చిత్రం భారతీయ థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో నార్నియా అనే అద్భుత ప్రపంచం ఆవిర్భావానికి సంబంధించిన అంశాలను పరిచయం చేశారు.

డిగరీ కిర్క్, పాలీ ప్లమ్మర్ పాత్రల ప్రయాణం చుట్టూ కథ సాగనుంది. ఈ క్రమంలో వారు ఎదుర్కొనే వింత అనుభవాలు, మాయాజాలం, సాహసాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రంలో డేవిడ్ మెక్‌కెన్నా డిగరీ కిర్క్ పాత్రలో, బీట్రైస్ క్యాంప్‌బెల్ పాలీ ప్లమ్మర్‌గా నటిస్తున్నారు. ఎమ్మా మాకీ యువ జాడిస్ పాత్రలో కనిపించనుండగా, డేనియల్ క్రెయిగ్ అంకుల్ ఆండ్రూ పాత్రను పోషిస్తున్నారు. కేరీ ముల్లిగన్, కోబ్నా హోల్డ్‌బ్రూక్-స్మిత్, మెరిల్ స్ట్రీప్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.‘బార్బీ’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గ్రెటా గెర్విగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’ పుస్తక శ్రేణిలో ‘ది మెజీషియన్స్ నెఫ్యూ’ ఆరో పుస్తకం. అయితే కథాక్రమం ప్రకారం ఇది ‘ది లయన్, ది విచ్ అండ్ ది వార్డ్‌రోబ్’కు ముందు జరిగే సంఘటనలను  చెబుతుంది. నార్నియా ప్రపంచం ఎలా ఆవిర్భవించిందనే అంశం ఈ కథలో ప్రధానంగా ఉండనుంది. 

ALSO READ:
Ranabaali X Review: ‘రణబాలి’కి మిక్స్‌డ్ టాక్.. విజయ్, రష్మిక కెమిస్ట్రీ సూపర్.. అసలు చిక్కంతా అక్కడే!

Crazy Kalyanam Review: అనుపమ పరమేశ్వరన్ '‘క్రేజీ కల్యాణం’ ఎలా ఉందంటే..

Aishwarya Lekshmi: లైఫ్‌ పార్టనర్‌ ముందు ఎలా ఉండాలంటే..

jailer 2 : రజనీ అభిమానులకు ముందే వచ్చిన దీపావళి

Updated Date - Oct 16 , 2026 | 02:58 PM