సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

భారత్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

ABN, Publish Date - Nov 17 , 2026 | 05:53 PM

మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ అడ్వాన్స్ బుకింగ్స్ భారత్‌లో ప్రారంభమయ్యాయి. ప్రధాన నగరాల్లో టికెట్లు వేగంగా అమ్ముడవుతుండగా, డిసెంబర్ 17న సినిమా విడుదల కానుంది.

Avengers: Doomsday

మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, భారత్‌లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో అభిమానులు చేపట్టిన #OpenDoomsdayBookings ప్రచారానికి స్పందించిన మార్వెల్ సంస్థ టికెట్ బుకింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభిస్తోంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. రోజంతా వివిధ సమయాల్లో షోలు అందుబాటులో ఉండటంతో అభిమానులు మొదటి రోజు మొదటి షో టికెట్ల కోసం పోటీపడుతున్నారు.


ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ క్రేజ్ నెలకొంది. అడ్వాన్స్ టికెట్ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ డాలర్లను దాటినట్లు సమాచారం. ఇక ఈ సినిమా విడుదలైన తొలి ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 503 మిలియన్ల వ్యూస్ సాధించి, ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్లలో రెండో స్థానంలో నిలిచింది. భారతీయ ప్రేక్షకులకు మరో ప్రత్యేకమైన కానుకగా, అమెరికా విడుదల కంటే ఒక రోజు ముందుగానే ఈ సినిమా మన దేశంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో మార్వెల్ స్టూడియోస్ ప్రెజెంట్స్ ఇన్ఫినిటీ విజన్‌తో పాటు ఇతర ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.

ఇవి కూడా చదవండి:

సోల్‌‌మేట్‌కు లిప్ కిస్.. ‘పులి’ పిల్ల పబ్లిగ్గా చేసిన రచ్చ చూశారా?

Dragon: నీల్ మామ.. ఇదేం ఫాంట‌సీ అయ్యా నీకు! అప్పుడు కేజీఎఫ్, స‌లార్.. ఇప్పుడు డ్రాగ‌న్

ఒకే కథాంశంతో రెండు సినిమాలు.. ఒకే రోజు విడుదల!

Updated Date - Nov 17 , 2026 | 05:58 PM