మిడ్‌నైట్ అప్డేట్స్.. జక్కన్నా నీ స్ట్రాటజీని అందుకోవడం కష్టమే..

ABN , Publish Date - Nov 16 , 2026 | 10:01 PM

ఒక సినిమా గురించి ప్రమోషన్లు ఎలా చేయాలో జక్కన్న రాజమౌళిని చూసి నేర్చుకోవాలని ఇండస్ట్రీలో చాలా మంది అంటుంటారు. కానీ ఆయన ఎప్పుడు సైలెంట్‌గా ఉంటాడో, ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేలుస్తాడో మాత్రం ఎవరూ ఊహించలేరు.

Varanasi New Update

ఒక సినిమా గురించి ప్రమోషన్లు ఎలా చేయాలో జక్కన్న రాజమౌళి (SS Rajamouli)ని చూసి నేర్చుకోవాలని ఇండస్ట్రీలో చాలా మంది అంటుంటారు. కానీ ఆయన ఎప్పుడు సైలెంట్‌గా ఉంటాడో, ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేలుస్తాడో మాత్రం ఎవరూ ఊహించలేరు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి నేటి వరకు.. రోజుకో రూమర్, పూటకో థియరీ. సాధారణంగా ఏ పెద్ద సినిమాకైనా పూజా కార్యక్రమాలు, ఓపెనింగ్ ఈవెంట్లు అట్టహాసంగా చేస్తారు. కెమెరాలు, లైట్ల మధ్య పండగ వాతావరణం కనిపిస్తుంది. కానీ ‘వారణాసి’ (Varanasi) విషయంలో ఏం జరిగింది..? పూజా కార్యక్రమం జరిగి రెండేళ్లు కావొస్తున్నా.. దానికి సంబంధించి కనీసం ఒక్కటంటే ఒక్క చిన్న ఫొటో కూడా బయటకు రాలేదు. అదీ జక్కన్న మార్క్ సీక్రెసీ.


సినిమా షూటింగ్ మొదలవుతోందంటూ సింహాన్ని బంధించినట్లుగా ఒక్క పోస్ట్ పెట్టి ఇంటర్నెట్‌ను షేక్ చేసేశారు. ఇక అభిమానులంతా ప్రతి పండుగకు, ప్రతి ఈవెంట్‌కు అప్‌డేట్స్ వస్తాయని ఆశగా ఎదురుచూశారు. చివరకు మహేష్ బాబు పుట్టినరోజున కూడా ఏదో భారీ టీజర్ వస్తుందనుకుంటే.. సింపుల్‌గా ఒక లుక్ వదిలి మళ్లీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది చిత్ర యూనిట్. ఆ తర్వాత గతేడాది నవంబర్ మొదటి వారం నుంచి వరుసగా చిన్న చిన్న హింట్స్ ఇస్తూ హైప్ పెంచుకుంటూ వచ్చారు. నవంబర్ 15న వచ్చిన ఆ ప్రీ-గ్లింప్స్ గుర్తుంది కదా..? ఒక్క గ్లింప్స్‌తో ఇండియన్ సినిమా సరిహద్దులు దాటి, హాలీవుడ్ వర్గాలు సైతం ‘వారణాసి’ వైపు చూసేలా చేశారు రాజమౌళి. ఆ విజువల్స్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. అయితే.. ఆ ప్రీ-గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కంప్లీట్ డ్రాప్ సైలెన్స్. మూవీ గ్లింప్స్ వచ్చి ఏడాది దాటిపోయింది. ఈ గ్యాప్‌లో సోషల్ మీడియాలో ఎన్ని ఊహాగానాలో లెక్కేలేదు. సినిమా అనుకున్న సమయానికి రాదా..? షూటింగ్ ఆలస్యమవుతోందా..? లేక ఇంకేదైనా మార్పులు జరుగుతున్నాయా..? అంటూ రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఫ్యాన్స్‌లో తీవ్రమైన ఆందోళన మొదలైంది. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి.


అందరూ నిద్రపోతున్న వేళ.. అర్ధరాత్రి ఒక్క అధికారిక ప్రకటనతో నెట్టింట సునామీ సృష్టించారు. వారణాసి షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని స్పష్టం చేసేశారు. ప్రస్తుతం హై-ఎండ్ సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. అసలైన బ్లాస్టింగ్ అప్‌డేట్ త్వరలోనే రాబోతోందని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. సినిమా ప్రారంభమైన నాటి నుంచి రీసెంట్‌గా వచ్చిన పోస్ట్ వరకు అన్నీ రాత్రే రావడం ‘వారణాసి’ టీమ్‌కు అలవాటైపోయింది. దాంతో సోషల్ మీడియాలో మిడ్‌నైట్ డిస్కషన్లు పీక్స్‌కు చేరుకుంటున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. రాజమౌళి ఇవ్వబోయే ఆ తర్వాతి బిగ్ అప్‌డేట్‌తోనే సినిమా రిలీజ్ డేట్‌పై ఒక పూర్తి స్థాయి స్పష్టత రానుందట. గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించబోతున్నారా..? లేక వచ్చే ఏడాదే బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయబోతున్నారా అనేది అతి త్వరలోనే తేలనుంది. మరి జక్కన్న ఇవ్వబోయే ఆ బ్లాస్టింగ్ అప్‌డేట్ అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

మన డాక్టర్ బాబు మంచి హిట్ కొడతాడు: అలీ

నవ్విస్తూ, భయపెట్టేందుకు ‘భూతం ప్రేతం’ రెడీ..

మలేషియాలో గ్రాండ్‌గా మృణాళిని వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్

Updated Date - Nov 16 , 2026 | 10:01 PM

Varanasi: గ్లోబల్‌ వేదికపై ‘వారణాసి’ ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌..

Varanasi OTT: ఆ ఓటీటీకి రాజమౌళి షాక్.. వారణాసి కోసం కొత్త ప్లాన్!

Varanasi: 50 భాషల్లో.. జక్కన్న అంటే ఆ మాత్రం ఉండాల్సిందే

Varanasi: 'వారణాసి'.. స‌రికొత్త చ‌రిత్ర! ఆ థియేటర్‌లో.. టీజర్ స్క్రీనింగ్

Varanasi: అప్పుడే.. వారి బుర్రలకు పని పెట్టిన జ‌క్క‌న్న‌