Avengers Doomsday: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ‘అవెంజర్స్’ క్రేజ్.. రిలీజ్‌కు ముందే భారీ హైప్!
ABN , Publish Date - Aug 18 , 2026 | 10:01 AM
మరో నాలుగు నెలల్లో రానున్న‘అవెంజర్స్: డూమ్స్‌డే’పై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి నుంచే భారీ క్రేజ్ మొదలైంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ వైరల్ అవుతున్నాయి.
హాలీవుడ్ (Hollywood Movies) సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో మంచి క్రేజ్ ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మార్వెల్ (Marvel Movies) సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా మరోసారి ఆ సందడి మొదలైంది. మార్వెల్ అభిమానులకు మరోసారి పెద్ద పండగ రాబోతోంది. అయితే ఎప్పుడైని సినిమా రిలీజ్ రెండు మూడు రోజులు ఉందనగా మన దగ్గర హడావుడి అంతకంతకు పెరుగూ పోయేది. కానీ ఇప్పుడు అంతా సీన్ రివర్స్ అయి స్టెయిట్ సినిమాల మాదిరి రెండు మూడు నెలల ముందు నుంచే హాలీవుడ్ సినిమాల విషయంలో ఫ్యాన్స్ రచ్చ మొదలవుతోంది.
ఇప్పటికీ ఇంకా ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మేనియా పూర్తిగా తగ్గకముందే.. ఇప్పుడు అందరి చూపు ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ (Avengers Doomsday) పై పడింది. ఇటీవల విడుదలైన వీడియోతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరోసారి అవెంజర్స్ భారీ పోరాటంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో మార్వెల్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. సినిమా ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తితో సోషల్ మీడియాలో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేకంగా, గ్రూపులుగా ఏర్పడి మరి చర్చలు చేస్తున్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హాలీవుడ్ సినిమాలకు ఊహించని ఆదరణ లభిస్తోంది. ‘ఆబ్సెషన్’, ‘ది ఒడిస్సీ’, ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ వంటి సినిమాలకు వచ్చిన స్పందనతో ఇప్పుడు అందరి దృష్టి ఈ మార్కెట్‌పై ఉంది. ఈ నేపథ్యంలో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్వెల్ అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ సినీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్ మేడ్ ఎడిట్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవెంజర్స్‌కు సంబంధించిన పోస్టులు, ఎడిట్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
రోజురోజుకీ పెరుగుతున్న అంచనాలు
ఆ మధ్య వచ్చిన గ్లింప్స్, టీజర్ అంతగా అంచనాలు తీసుకు రాకపోయినప్పటికీ ఇటీవల డూమ్‌ను పరిచయం చేస్తూ మేకర్స్ విడుదల చేసిన వీడియో సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. అవెంజర్స్ మరోసారి పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారనే విషయం అభిమానుల్లో ఉత్సకతను అమాంతం పెంచి అంచనాలను మరింతగా పెంచుతోంది. అదీగాక ఈ సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మొదలైన హడావుడి చూస్తే.. అసలు మేనియా రిలీజ్ టైమ్‌కు ఏ స్థాయికి చేరుతుందో మీ ఐహలకే వదిలేస్తున్నా అనేలా ఊహించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే థియేటర్లలో ఈ సినిమాను చూసేందుకు ఇప్పటి నుంచే ప్లానింగ్ మొదలుపెట్టిన అభిమానులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఒడిస్సీ, స్పైడర్ మాన్ ్రాంగ్ న్యూ డేల మాదిరి ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సైతం తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలాఉంటే.. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ డిసెంబర్ 17న భారతీయ థియేటర్లలో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేగాక ఒక్కరోజు తేడాతో డ్యూన్ పార్ట్ 3 (Dune: Part Three) సైతం రిలీజ్ అవుతుండడంతో సర్వత్రా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సినీ లవర్స్ చూపంతా ఇప్పుడు ఈ రెండు చిత్రాలపైనే ఉంది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో పాటు హై విజువల్స్, కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో రూపొందించినవి కావడంతో అభిమానులు ఇప్పటినుంచే ముందస్తు ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మొదలైన ఈ క్రేజ్ రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.