Avengers Endgame: 'అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ మళ్లీ థియేటర్లలోకి..

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:40 PM

మార్వెల్‌ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ సినిమాను భారతీయ ప్రేక్షకులు మరోసారి బిగ్‌స్క్రీన్‌పై చూసే అవకాశం లభించనుంది.

మార్వెల్‌ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ సినిమాను భారతీయ ప్రేక్షకులు మరోసారి బిగ్‌స్క్రీన్‌పై చూసే అవకాశం లభించనుంది. ఆంథనీ, జో రూసో దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కెవిన్‌ ఫైజీ నిర్మించారు. మార్వెల్‌ స్టూడియోస్‌ ఈసారి సినిమాను ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌: ఎంకోర్‌’ పేరుతో ప్రత్యేకంగా రీరిలీజ్‌ చేస్తోంది. సెప్టెంబర్‌ 25 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. 

నాలుగు భాషల్లో రిలీజ్‌..

‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌: ఎంకోర్‌’ను ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. దీంతో సౌత్‌ ఇండియాలోని మార్వెల్‌ అభిమానులకు కూడా తమ ఫేవరెట్‌ సూపర్‌హీరోలను మరోసారి థియేటర్‌లో చూసే అవకాశం దక్కనుంది. సాధారణ స్క్రీన్స్‌తో పాటు ఐమాక్స్‌, మార్వెల్‌ స్టూడియోస్‌ ఇన్ఫినిటీ విజన్‌ సర్టిఫైడ్‌ ప్రీమియం లార్జ్‌ ఫార్మాట్‌ స్క్రీన్స్‌లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.  

‘డూమ్స్‌డే’ స్నీక్‌ పీక్‌ హైలైట్‌..

ఈ ఎంకోర్‌ ప్రదర్శనకు ఆకర్షణ మాత్రం ‘అవెంజర్స్‌: డూమ్స్‌డే’. మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి రాబోతున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్‌ 18, 2026న విడుదల కానున్న ‘డూమ్స్‌డే’కు సంబంధించిన ప్రత్యేకమైన స్నీక్‌ పీక్‌ను ‘ఎండ్‌గేమ్‌: ఎంకోర్‌’  స్క్రీనింగ్ లో  చూపించనున్నారు. అంటే ప్రేక్షకులకు ఒకే టికెట్‌తో రెండు ప్రత్యేక అనుభవాలు లభించనున్నాయి.  

  

 

Updated Date - Aug 27 , 2026 | 01:12 PM