సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ramayana: జీవీ ప్రకాశ్‌కు ఏఆర్ రెహమాన్ పిలుపు.. ఎందుకో తెలుసా?

ABN, Publish Date - Oct 17 , 2026 | 09:02 AM

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. ఈ సినిమాలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ కూడా భాగమయ్యారు.

GV Prakash Kumar about Ramayana Chance

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana). బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) రావణాసురుడిగా నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, లెజెండరీ హాలీవుడ్ కంపోజర్ హన్స్ జిమ్మెర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలోకి జాతీయ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) కూడా వచ్చి చేరారు.


తాజాగా జీవీ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ ‘రామాయణ’లో తాను భాగమైన విధానాన్ని స్వయంగా పంచుకున్నారు. ‘‘నేను అయోధ్య నుంచి తిరిగి వచ్చిన వెంటనే ‘రామాయణ’ చిత్రం కోసం ఓ అద్భుతమైన పాటను రికార్డ్ చేశాను. నిజంగా ఇదొక నమ్మశక్యం కాని అనుభూతి. అసలు నా జీవితంలో ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. నిజం చెప్పాలంటే.. నేను ఈ సినిమాలో భాగం అవుతున్నాననే విషయం ముందుగా నాకు అసలు తెలియదు. నేను అయోధ్య ట్రిప్ ముగించుకుని ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా.. అనుకోకుండా ఏఆర్ రెహమాన్ సార్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే వచ్చి ఓ పాట పాడమని ఆయన అడిగారు..’’ అని అసలు విషయం వెల్లడించారు.


ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన డివోషనల్ చిత్రం ‘ఇరుముడి’లోని పాటలకు జీవీ ప్రకాశ్ కుమారే సంగీతం అందించారు. ఆ చిత్రంలో ఆయన సమకూర్చిన భక్తిరస గీతాలు శ్రోతలను ఎంతగానో పరవశింపజేశాయి. అలా ‘ఇరుముడి’తో భక్తి భావాన్ని పంచిన జీవీ.. ఇప్పుడు స్వయంగా అయోధ్య రామమందిరాన్ని దర్శించుకుని వచ్చిన వెంటనే, అదే రాముడి గాథ ఆధారంగా రూపొందుతున్న సినిమాలో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాట పాడటం ఓ దైవికమైన కాకతాళీయంగా మారింది. గతంలో రెహమాన్ సంగీతంలో పలు సూపర్ హిట్ పాటలు పాడిన జీవీ ప్రకాశ్.. చాలా కాలం తర్వాత మళ్లీ ఆయన ఆధ్వర్యంలో, అది కూడా ‘రామాయణ’ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో శరవేగంగా పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన ఈ తాజా అప్‌డేట్ సినీ ప్రేమికుల్లో, సంగీత ప్రియుల్లో సినిమాపై ఉన్న క్యూరియాసిటీని మరింత పెంచేసింది.

ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో హీరోయిన్లకు మినహాయింపు లేదు: ‘బ్లాస్ట్’ బ్యూటీ

జనవరి 12న విడుదల.. అనిల్ రావిపూడి, నీ చర్యలు ఊహాతీతం

Danny: రా అండ్ రస్టిక్ చిత్రం ‘డానీ’ రిలీజ్ డేట్ ఖరారు

Updated Date - Oct 17 , 2026 | 09:02 AM