‘ధురంధర్ 2’ రికార్డులు బద్దలవుతున్నాయ్.. అంతా రామ మయం
ABN , Publish Date - Nov 09 , 2026 | 05:19 PM
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పౌరాణిక దృశ్యకావ్యం ఇటు దేశ వ్యాప్తంగా, అటు ఓవర్సీస్ మార్కెట్లలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది.
బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఎక్కడ చూసినా ‘రామాయణ’ (Ramayana) నామస్మరణే వినిపిస్తోంది. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పౌరాణిక దృశ్యకావ్యం ఇటు దేశ వ్యాప్తంగా, అటు ఓవర్సీస్ మార్కెట్లలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం.. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’ (BookMyShow) లో ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును నమోదు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తాజా గణాంకాల ప్రకారం బుక్‌మైషోలో ఒక గంట వ్యవధిలోనే ఏకంగా 122.3K (లక్షా 22 వేలకు పైగా) టికెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో బాలీవుడ్ భారీ చిత్రం ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) పేరిట ఉన్న గంటకు 109K (లక్షా 9 వేల) టికెట్ల రికార్డును ‘రామాయణ’ అలవోకగా తుడిచిపెట్టేసింది. ఒక భారతీయ సినిమాకు ఒక గంటలో ఇంత భారీ స్థాయిలో టికెట్లు బుక్ కావడం భారత చలనచిత్ర చరిత్రలోనే ఇదే ప్రథమం. ఈ జోరు చూస్తుంటే సోమవారంతో పాటు రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని మైలురాళ్లను ‘రామాయణ’ అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.
అత్యాధునిక వీఎఫ్ఎక్స్ హంగులు, కనీవినీ ఎరుగని భారీ స్కేల్‌తో రూపొందిన ఈ చిత్రంలో సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్ తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. సీతాదేవి పాత్రకి సంబంధించి సాయి పల్లవి విషయంలో నెగిటివ్ నడుస్తున్నా.. టికెట్ల బుకింగ్‌కు అది ఎలాంటి ఎఫెక్ట్ కాకపోవడం విశేషం. ఇంకా ఈ సినిమాలో రవి దూబే, సన్నీ డియోల్, అరుణ్ గోవిల్, లారా దత్తా, ఇందిరా కృష్ణన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, షీబా చద్దా, అనుపమ్ ఖేర్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. గ్లోబల్ లెజెండ్ హన్స్ జిమ్మర్, ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంయుక్తంగా ఈ సినిమాకు సంగీతం అందించారు. మరోవైపు కలెక్షన్స్ పరంగానూ ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళుతున్నట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’కు బ్రేకులు? కారణమిదేనా..
‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
పాన్ ఇండియా సినిమాల్లో ఆ మూడు బ్యానర్స్‌దే హవా