Pooja Hegde: ఆ స్టార్ హీరో చెంప చెళ్లుమనిపించా.. బుట్టబొమ్మ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:39 PM
బుట్ట బొమ్మ పూజాహెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. రాధే శ్యామ్ సినిమా తరువాత ఇప్పటివరకు పూజా ఒక హిట్ కూడా అందుకోలేదు.
Pooja Hegde: బుట్ట బొమ్మ పూజాహెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. రాధే శ్యామ్ సినిమా తరువాత ఇప్పటివరకు పూజా ఒక హిట్ కూడా అందుకోలేదు. అయినా సరే, తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా అవకాశాలను మాత్రం అందుకుంటూనే వస్తుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో జన నాయకుడు రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. మరో రెండు సెట్స్ మీద ఉన్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కి దారితీసాయి. అంతలా ఈ చిన్నది దేని గురించి కామెంట్స్ చేసింది అంటే .. ఒక పాన్ ఇండియా హీరో.. తన పర్మిషన్ లేకుండా కార్ వాన్ లోకి చొరబడినట్లు చెప్పుకొచ్చినట్లు చెప్తున్నారు.. ' ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా మేము కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు మా అనుమతి లేకుండా హీరోలు కార్ వాన్ లోకి వచ్చేస్తారు. చాలా ఏళ్ళ క్రితం నేను ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్న సమయంలో ఒక హీరో.. నా అనుమతి లేకుండా, కనీసం పిలవకుండా వచ్చేసాడు. వెంటనే నేను అతని చెంప చెళ్లుమనిపించాను. అప్పటి నుంచి ఇప్పటివరకు అతను నాతో మరో సినిమా చేయలేదు' అని తెలిపినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ హీరో ఎవరు అంటూ నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్ మీ హీరో అంటే.. కాదు మీ హీరో అని యుద్ధం మొదలుపెట్టారు. అసలు పూజా చెంప చెళ్లుమనిపించిన హీరో ఎవరు.. ? అనేది మిస్టరీగా మారింది. అసలు పూజా ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసింది.. ? ఈ వ్యాఖ్యలు నిజమేనా.. ? అనేది తెలియాల్సి ఉంది.