వివేక్ అగ్నిహోత్రి - కార్తీక్ ఆర్యన్ తొలి కలయికలో...
ABN, Publish Date - Oct 29 , 2026 | 03:29 PM
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆపరేషన్ సిందూర్ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ కీలక పాత్ర పోషించనున్నారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'ది కశ్మీర్ ఫైల్స్, ది తష్కెంట్ ఫైల్స్' చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వివేక్ రంజన్ అగ్నిహోత్రి తదుపరి చిత్రాలు ఆ స్థాయిలో బాక్సాఫీస్ బరిలో సందడి చేయలేకపోయాయి. అయినా... వివేక్ అగ్నిహోత్రి మాత్రం మడమ తిప్పకుండా ఈ దేశంలో జరిగిన కీలక సంఘటనల నేపథ్యంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు.
తాజాగా వివేక్ అగ్నిహోత్రి టీ సీరిస్ అధినేత భూషన్ కుమార్తో కలిసి 'ఆపరేషన్ సిందూర్' మూవీని తెరకెక్కిస్తున్నాడు. 2025లో పెహల్గామ్లో ముస్లిం ఉగ్రవాదులు జరిపిన దాడి, తదనంతర పరిణామాలు, భారత ప్రభుత్వ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో ఈ సినిమా సాగబోతోంది. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కె.జె.ఎస్. టినీ ధిల్లాన్ రాసిన 'ఆపరేషన్ సిందూర్ : ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్ సైడ్ పాకిస్తాన్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో కీలక పాత్రకు ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ పోషించబోతున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్ తో కలిసి వివేక్ అగ్నిహోత్రి వర్క్ చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ 'కెప్టెన్ ఇండియా' మూవీ నటిస్తున్నాడు. దీని షూటింగ్ పూర్తికాగానే అతను 'ఆపరేషన్ సిందూర్' షూటింగ్లో పాల్గొంటాడని తెలుస్తోంది.
ALSO READ:
Pawan Kalyan: పవన్ కల్యాణ్.. ‘అర్జున’.. రేసులో ముగ్గురు బడా డైరెక్టర్లు!
Suriya: తిరుచ్చెందూరు మురుగన్ సేవలో సూర్య
ధనుష్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు, నగదు బహుమతులు!