Darshan: రేణుకాస్వామి హత్యకేసు.. ఆ రోజు దర్శన్‌ను చూడలేదన్న ప్రత్యక్ష సాక్షి!
ABN , Publish Date - Oct 29 , 2026 | 10:03 AM
రేణుకాస్వామి హత్యకేసులో బెంగళూరు సెషన్స్ కోర్టులో పునీత్ వాంగ్మూలం ఇచ్చారు. ఘటన జరిగిన రోజు వివరాలను తెలిపారు.
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో (Renukaswamy Murder Case) ప్రత్య క్షసాక్షి. నటుడు దర్శన్ (Darshan)ను చూడలేదని కోర్టుకు విన్నవించారు. కేసు విచారణలో భాగంగా బెంగళూరు సెషన్స్ కోర్టు (Bengaluru Sessions Court) లో బుధవారం పట్టణగెరె షెడ్లో పనిచేసే పునీత్ (Punith) అనే వ్యక్తి విచారణ జరిగింది. హత్యకేసులో ఇటీవల దాకా అప్రూవర్ ప్రదోష్ రావ్ విచారణ ముగియగా సాక్షుల విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. షెడ్లో పనిచేసే పునీత్ కోర్టు ముందు హాజరయ్యారు. తాను కొంత కాలంగా పట్టణగెరె షెడ్లో పనిచేస్తున్నానని తెలిపారు.
గత ఏడాది జూన్ 8న పట్టణగెరె షెడ్లోనే సాయంత్రం 6.30 గంటలదాకా ఉన్నానని తెలిపారు. సాయంత్రం ఎవరో కారులో అక్కడ చెట్టు వద్దకు వచ్చి వెళ్లారని తెలిపారు. ఆ తర్వాత తాను మలె మహదేశ్వర ఆలయానికి వెళ్లానని వివరించారు. అప్పుడు సెక్యూరిటీగార్డులు మల్లికార్జున, కిరణ్, బసవరాజ్ ఉన్నారని అన్నారు. ఈ నిందితులను తాను చూడలేదని పునీత్ తెలిపారు. దీనితో దర్శనక్కు ఇది అనుకూల సాక్ష్యం అయ్యింది. కాగా ప్రభుత్వ న్యాయవాది అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు.