నటి నెక్కంటి శ్రీదేవిపై అసభ్యకర పోస్టులు.. రియాల్టీ షోలోని తోటి కంటెస్టులపై ఫిర్యాదు
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:37 AM
రియాలిటీ షోలో పాల్గొన్న నటి నెక్కంటి శ్రీదేవి చౌదరి సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో (Amazon Prime Video) ప్రసారమవుతున్న ది టైట్రర్స్ (The Traitors Telugu) రియాలిటీ షోలో పాల్గొన్న వ్యాపారవేత్త, నటి నెక్కంటి శ్రీదేవి చౌదరి (Shreedevi Chowdary)పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారంలో జూబ్లీహిల్స్ పోలీసులు (Jubilee Hills Police) కేసు నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
రియాలిటీ షోలో తోటి కంటెస్టెంట్‌గా పాల్గొన్న ధనుంజయ్ (Dhanunjay)తో పాటు మరికొందరు ఉద్దేశపూర్వకంగా తన వయసు, వ్యక్తిగత ప్రతిష్టను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అవమానకర రీతిలో ట్రోల్స్, మీమ్స్ ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నానని, తన పరువుకు భంగం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.