రజని.. కమల్ సినిమా.. పారితోషికాలకే అన్ని కోట్లా..
ABN , Publish Date - Oct 29 , 2026 | 10:22 AM
సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో భారీ మల్టీస్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajanikanth), లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కలయికలో భారీ మల్టీస్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'KHXRK’ వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఏకంగా రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు రజనీకాంత్, కమల్ హాసన్ ఒక్కొక్కరు రూ.200 కోట్ల పారితోషికం అందుకోనున్నట్లు కూడ ప్రచారం సాగుతోంది. ‘జైలర్ 2’ సినిమాకు రూ.60 కోట్ల పారితోషికం అందుకొన్న దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌కు ఈ సినిమా కోసం రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నారని టాక్ నడుస్తోంది.
మిగిలిన రూ.300 కోట్లు దేనికంటే?
ఈ ప్రాజెక్ట్ కోసం రజనీకాంత్, కమల్ హాసన్‌లకు కలిపి రూ.400 కోట్లు, దర్శకుడు నెల్సన్‌కు రూ.100 కోట్లు కేటాయిస్తే.. మిగిలిన రూ.300 కోట్లను ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, నిర్మాణ వ్యయాల కోసం వినియోగించనున్నట్లు తెలిసింది. ఇదే నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా ఈ ప్రాజెక్ట్ నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, దర్శకుడు నెల్సన్ స్క్రిప్ట్ పనులను దాదాపు పూర్తి చేసే దశలో ఉన్నారని, 2027 జనవరిలోనే చిత్రీకరణ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. వచ్చే ఏడాది ఏప్రిల్–మే నెలల్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
ALSO READ:
Pawan Kalyan: పవన్ కల్యాణ్.. ‘అర్జున’.. రేసులో ముగ్గురు బడా డైరెక్టర్లు!
Suriya: తిరుచ్చెందూరు మురుగన్ సేవలో సూర్య
ధనుష్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు, నగదు బహుమతులు!