కింగ్ 100 టైటిల్ మారింది.. ఏంటో తెలుసా
ABN , Publish Date - Oct 28 , 2026 | 07:54 PM
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక మైల్స్టోన్ ప్రాజెక్ట్ అయిన 100వ చిత్రం 'కింగ్ 100' (King 100). టాలెంటెడ్ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ల్యాండ్‌మార్క్ సినిమాలో టబు, ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, విజయేంద్ర, అశోక్ సెల్వన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక మైల్స్టోన్ ప్రాజెక్ట్ అయిన 100వ చిత్రం 'కింగ్ 100' (King 100). టాలెంటెడ్ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ల్యాండ్‌మార్క్ సినిమాలో టబు, ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, విజయేంద్ర, అశోక్ సెల్వన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం నాగ్ ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టైటిల్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేశాయి.
ఈ సినిమా నుంచి సీనియర్ నటి టబుకు సంబంధించిన గ్లింప్స్‌ను విజయదశమి కానుకగా విడుదల చేయాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల మేకర్స్ దాన్ని వాయిదా వేశారు. దీంతో అక్కినేని అభిమానులు తదుపరి అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటి నుంచి ఈ సినిమా టైటిల్ కింగ్ 100 అనే మేకర్స్ ప్రకటించారు. కానీ, అది అసలు టైటిల్ కాదంట. కింగ్ 100 కాకుండా ఈ చిత్రానికి ఖైదీ100 అనే కొత్త టైటిల్‌ను అనౌన్స్ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే చిరంజీవి ఖైదీ నెం 150 అంటూ వచ్చి హిట్ కొట్టగా.. ఇప్పుడు నాగ్ ఖైదీ100 అంటూ రాబోతున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఈ టైటిల్ బావుందని చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ టైటిల్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. ఇంకోపక్క ఈ సినిమా ఇంకా నిర్మాణ దశలో ఉండగానే దీనికి సంబంధించిన బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అన్ని భాషల్లో కలిపి భారీ ఫ్యాన్సీ ధరకు దక్కించుకున్నట్లు టాక్ నడుస్తోంది. నాగ్ కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ డిజిటల్ డీల్స్‌గా నిలవనుందని తెలుస్తోంది. మరి ఇంత హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.