ధనుష్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు, నగదు బహుమతులు!

ABN , Publish Date - Oct 29 , 2026 | 09:40 AM

హీరో ధనుష్ విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2027 జనవరి నుంచి టెన్త్, ప్లస్ టూ విద్యార్థులకు ఏసీతో కూడిన ఉచిత ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Dhanush

ప్రముఖ హీరో ధనుష్ (Dhanush) తన రాజకీయ ఉనికిని మరింత పటిష్ఠం చేసేందుకు టెన్త్, ప్లస్ టూ విద్యార్థులకు ఉచిత ట్యూషన్ (Free Tuition Centres) కేంద్రాలను జనవరిలో ఆయన పేరుతో ఉన్న నర్సనిమండ్రం సంస్థ‌ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు. తమిళగ ఎళుచ్చి కళగం (Tamilaga Ezhuchi Kazhagam) అనే పార్టీని ప్రారంభించనున్న నేపథ్యంలో ధనుష్ తన సేవా కార్యక్రమాలను ముమ్మరం చేసే ప్రయత్నాల్లో దిగారు. మొదటి దశలో 2027 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఏసీతో కూడిన ఉచిత ట్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

ఒక ట్యూషన్ సెంటర్‌లో ముగ్గురు ఉపాధ్యాయులను, ఒక సహాయకుడిని నియమించనున్నారు. వీరికి ధనుష్ ఛారిటీ మూవ్‌మెంట్ సంస్థ నుంచి జీతాలను చెల్లించే విషమై పరిశీలిస్తున్నట్లు తెలి సింది. వచ్చే ఏడాది మేలో ప్లస్ టూ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు వారిని ధనుష్ తన ఖర్చుతో విద్యార్థులు కోరొన కళాశాలల్లో చేర్పిస్తారని సమాచారం.

Updated Date - Oct 29 , 2026 | 10:43 AM