కాఫీ విత్ కరణ్‌కు విజయ్ దేవరకొండ, రశ్మిక!
ABN, Publish Date - Oct 06 , 2026 | 07:49 AM
కాఫీ విత్ కరణ్ సీజన్ 9లో విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ కలిసి పాల్గొననున్నారని సమాచారం. అల్లు అర్జున్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సీజన్‌లో సందడి చేయనున్నారు.
కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించే కాఫీ విత్ కరణ్ సీజన్ 9 అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ దీపావళికి దీని ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని అంటున్నారు. అయితే ఈ సీజన్ లో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ కూడా టాలీవుడ్ నుంచి దీనికి హాజరవుతారని ఇప్పటికే వచ్చిన సమాచారం. కాకపోతే... విజయ్ దేవరకొండతో పాటు అతని భార్య, స్టార్ హీరోయిన్ రశ్మిక మందణ్ణ కూడా ఈ షోలో పాల్గొనబోతోంది.
పెళ్ళికి ముందు 'గీత గోవిందం, డియర్ కామ్రేడ్' చిత్రాల్లో నటించిన ఈ జంటగా పెళ్ళైన తర్వాత తొలిసారి 'రణబాలి'లో నటిస్తోంది. ఈ సినిమా ఇదే నెల 16 విడుదల కాబోతోంది. సో... 'రణబాలి' సినిమా అనుభవాలతో పాటు ఈ స్టార్ కపుల్ లవ్ జర్నీని సైతం కరణ్ జోహార్ తన షోలో విపులంగా తెలియచెప్పాలని అనుకుంటున్నారట. అందుకే అతి త్వరలో ముంబైలో ఈ ఎపిసోడ్ షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే కాఫీ విత్ కరణ్‌లో విజయ్, రశ్మిక కలిసి పాల్గొనడం ఇదే మొదటిసారి కానీ విజయ్ దేవరకొండ గతంలోనే సీజన్ 7లో ఈ షోలో పాల్గొన్నాడు. విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ 'లైగర్' సమయంలో హీరోయిన్ అనన్య పాండేతో కలిసి విజయ్ ను కరణ్ జోహార్ ఆ షోలో ఇంటర్వ్యూ చేశాడు. సో... కరణ్ అడిగే ఆసక్తికరమైన ప్రశ్నలకు విజయ్ సమాధానాలు చెప్పడం ఇది రెండోసారి.
సీజన్ 9 అతిథులు వీరే!
కాఫీ విత్ కరణ్ షోకు ఈ సీజన్‌తో ఇక ఫుల్ స్టాప్ పెట్టేస్తారని అంటున్నారు. ఇదే ఈ షోకు సంబంధించి చిట్ట చివరి సీజన్ అట. అందుకే దీనిని సమ్ థింగ్ స్పెషల్ గా కరణ్ జోహార్ మలచబోతున్నాడట. విజయ్ దేవరకొండ, రశ్మిక; అల్లు అర్జున్ తో పాటుగా ఈసారి సీజన్ 9లో బాలీవుడ్ క్రేజీ హీరోలు విక్కీ కౌశల్, దిల్జీత్ దోసాంజీ కలిసి పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. అలానే 'దిల్ చాహ్‌తా హై' సినిమా విడుదలై పాతికేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, ఫర్హాన్ అక్తర్, అక్షయ్ ఖన్నాతో ఓ స్పెషల్ షో చేయబోతున్నాడట కరణ్ జోహార్. అదే విధంగా 'కభీ ఖుషీ కభీ గం' సినిమా పాతికేళ్ళు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగానూ కాజోల్, కరీనా కపూర్ ఖాన్, జయ బచ్చన్‌తో ఓ షో చేస్తాడట, అలానే అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్ 'గోల్ మాల్ 5'లో కలిసి నటిస్తున్నారు. వీరిద్దరితోనూ ఓ షో ఉంటుందని సమాచారం. ఇక వరుణ్ ధావన్, కృతి సనన్, సమయ్ రైనా, ఫరా ఖాన్, అనన్య పాండే, షనయా కపూర్, లక్ష్య, జాన్వీ కపూర్ సైతం ఈ షోలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ చివరి సీజన్‌తో కరణ్ జోహార్ ఎలాంటి సంచలనాలకు తెర లేపుతాడో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘డ్రాగన్’ భారీ షెడ్యూల్.. ఎన్టీఆర్ రీఎంట్రీ అక్కడేనా?
నెట్‌ఫ్లిక్స్‌లో అన్న - అమెజాన్‌లో తమ్ముడు.. దుమ్మురేపుతున్నారు
డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ వేధింపులపై విష్ణు మంచు కీలక నిర్ణయం