మరోసారి ఆదర్శ కుటుంబం వాయిదా..?
ABN , Publish Date - Oct 04 , 2026 | 08:39 PM
టాలీవుడ్‌లో ఒక సినిమా విడుదల తేదీ మారడం అనేది కేవలం పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమో లేక థియేటర్ల కొరతో మాత్రమే కాదు.. దాని వెనుక ఒక పెద్ద బిజినెస్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ఆదర్శ కుటుంబం సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.
టాలీవుడ్‌లో ఒక సినిమా విడుదల తేదీ మారడం అనేది కేవలం పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమో లేక థియేటర్ల కొరతో మాత్రమే కాదు.. దాని వెనుక ఒక పెద్ద బిజినెస్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ (Venkatesh) - త్రివిక్రమ్ (Trivikram) కలయికలో రాబోతున్న ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam) సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. అక్టోబర్ 2 అని మొదలై, అక్టోబర్ 9కి వచ్చి, చివరికి ప్రమోషన్ల జాడే లేకుండా అక్టోబర్ 30 వైపు రూట్ మార్చడం వెనుక పెద్ద కథే నడుస్తోంది. వారం రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ప్రమోషనల్ మైక్ పట్టుకోలేదంటేనే, ఈ సినిమా కేవలం వాయిదా పడలేదు.. కావాలనే స్పేస్ వెతుక్కుంటోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఈ ట్విస్ట్ వెనుక ఉన్న ప్రధాన ఎలిమెంట్.. హనుమాన్ అంశ్ అని చెప్పుకొస్తున్నారు. హిందీ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్ల సునామీ సృష్టించిన ఈ సినిమా తెలుగు రైట్స్‌ను మొదట త్రివిక్రమే డీల్ చేయాలనుకున్నాడు. కానీ అనూహ్యంగా ఆయన తప్పుకోవడం, ఆ వెంటనే కేజీఎఫ్, కాంతార వంటి పవర్ హౌస్ ప్రాజెక్ట్స్ తీసిన హోంబాలే ఫిల్మ్స్ సీన్‌లోకి రావడం వేగంగా జరిగిపోయాయి. ఇప్పుడు హోంబాలే సంస్థ తెలుగులో ఈ సినిమాను చాలా అగ్రెసివ్‌గా మార్కెట్ చేస్తోంది. ఓవైపు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సినిమా, మరోవైపు నార్త్ నుంచి నేరుగా వస్తున్న భారీ డివోషనల్ హైప్ మూవీ.. ఈ రెండూ ఒకే రోజు క్లాష్ అయితే ఓపెనింగ్స్ పరంగా రిస్క్ తప్పదని గురూజీ గ్రహించాడని, అందుకే ఆదర్శ కుటుంబం సినిమా ని వాయిదా వేసినట్లు సమాచారం.
అయితే ఇక్కడ ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.. హిందీ సినిమా హైప్‌కి భయపడి త్రివిక్రమ్ వెనక్కి తగ్గాడా? లేక ఇది మేకర్స్ వేసిన సేఫ్ గేమ్ ప్లానా? నిజానికి, త్రివిక్రమ్ లాంటి లీడింగ్ డైరెక్టర్ మరో సినిమాకు భయపడి వెనకడుగు వేసే అవకాశం తక్కువ. కానీ, ఒక ప్రొడ్యూసర్‌గా ఆలోచిస్తే బిజినెస్ సేఫ్టీ ముఖ్యం. హనుమాన్ అంశ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన వేవ్‌ను రైడ్ చేస్తోంది. అలాంటి సినిమాతో అనవసరంగా ఢీకొట్టి థియేటర్లను, వసూళ్లను పంచుకోవడం కంటే.. ఆ అలైన్‌మెంట్ మారే వరకు కాస్త ఆగడమే బుద్ధిమంతమైన పని అని ఆదర్శ కుటుంబం మేకర్స్ భావించి ఉండవచ్చని అంటున్నారు.
అందుకే ప్రస్తుతం మేకర్స్ చూపు అక్టోబర్ 30 మీద పడింది. సరిగ్గా ప్రమోషన్స్ డిజైన్ చేసుకుని, క్లీన్ సోలో రిలీజ్ దక్కించుకుంటే వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్ కున్న క్రేజ్ కి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. మరి గురూజీ వదిలిన డేట్ లో వచ్చే హనుమాన్ అంశ్ ఏ రేంజ్ లో హిట్ కొడుతుందో.. అక్టోబర్ 30 న వచ్చే ఆదర్శ కుటుంబం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.