కాకాకి గట్టి విలనే దొరికాడుగా..
ABN , Publish Date - Oct 05 , 2026 | 08:04 PM
మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కలసి పవర్-ప్యాక్డ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కాకా
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మాస్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కలసి పవర్-ప్యాక్డ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కాకా (Kaaka). వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనస్వర రాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే కాకా నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా కు సంబంధించిన ఒక అప్డేట్ ని మేకర్స్ అందించారు.
ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ నిఎంపిక చేసినట్లు మేకర్స్ తెలిపారు. చిరంజీవి పాత్రకు ధీటుగా సాగే పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో అనురాగ్ కశ్యప్ కనిపించనున్నాడని తెలుస్తోంది. దర్శకుడు బాబీ కథలోని ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు, దానికి బాలీవుడ్ నటుడి ఇమేజ్ పర్ఫెక్ట్‌గా సరిపోతుండటంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అనురాగ్ కశ్యప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ గానే కాకుండా నటుడుగా కూడా ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా మహారాజ సినిమాలో ఆయన విలనిజానికి ఫిధా కానీ వారుండరు. ఇక టాలీవుడ్ లో డెకాయిట్ సినిమాలో పోలీస్ గా అనురాగ్ కనిపించాడు. ఇక ఇప్పుడు చిరు సినిమాలో విలన్ గా కనిపిస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 న రిలీజ్ కానుంది. మరి కాకా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ వేధింపులపై విష్ణు మంచు కీలక నిర్ణయం
అలాంటి కొటేషన్స్ వేసి.. ఇలా తగ్గావ్ ఏంటి బండ్లన్నా?
నర్తకిగా పూజిత పొన్నాడ.. ఫస్ట్ లుక్ అదిరింది