418 Movie: ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడంటే...
ABN , Publish Date - Oct 05 , 2026 | 04:26 PM
ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన హారర్ మూవీ '418' దసరా కానుకగా ఐదు భాషల్లో అక్టోబర్ 23న విడుదల కాబోతోంది.
పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ‘418’తో డార్కర్ జానర్ లో అడుగుపెడుతోంది. సీరియస్, అన్‌సెటిలింగ్ నెరేటివ్‌తో భయాన్ని కొత్త కోణంలో చూపించబోతున్న ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథను కూడా ఆయనే రాశారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నిజానికి '418' సినిమా ఈ పాటికే విడుదల కావాల్సింది. కానీ అనివార్యంగా ఇప్పటికే పలు మార్లు దీనిని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా అక్టోబర్ 23న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమాను దసరా కానుకగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ హారర్, మిస్టరీతో సంచలనం సృష్టించింది. స్టన్నింగ్ విజువల్స్, చిల్లింగ్ పెర్ఫార్మెన్స్, హాంటింగ్ స్కోర్, సూపర్‌నేచురల్ థ్రిల్స్‌తో ‘418’ గ్రిప్పింగ్ హారర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఇందులో చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రలు పోషించారు. వెంకీ జీజీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు దినేష్ దివాకర్ సినిమాటోగ్రాఫర్.
ఇవి కూడా చదవండి:
నాపై ఐటీ దాడులా.. అసలు నిజాలు తెలుసుకోరా?: రకుల్ ప్రీత్ సింగ్
‘చుట్టమల్లే’ మార్ఫింగ్ వీడియోపై జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
పాత్రకు జీవం పోసేందుకు.. నటీనటుల్లో తరగని నటనాభిలాష!