Naga Vamsi: క్షమించండి.. ఆ భయంతోనే వాయిదా వేశాం
ABN , Publish Date - Oct 05 , 2026 | 04:14 PM
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam).
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ప్రమోషన్స్ సరిగా లేవని, అసలు సందడే లేదని నెటిజన్లు రాత్రి నుంచి నిర్మాతలను ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో, చిత్ర నిర్మాత సితార నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయాన్ని బయటపెడుతూ బహిరంగ క్షమాపణలు చెప్పుకొచ్చాడు.
"నాలుగు రోజుల క్రితమే ఆదర్శ కుటుంబం పక్కాగా రిలీజ్ అవుతుందని ట్వీట్ చేశాను. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదు. పరిస్థితి ఎలా ఉందంటే మీతో పాటు మేము కూడా థియేటర్‌లోనే ఫస్ట్ కాపీ చూసేలా ఉంది. ప్రమోషన్స్ కూడా సరిగా చేయడం లేదంటున్నారు. అందుకే వెంకటేష్ గారికి, సురేష్ బాబు గారికి, అభిమానులకు నా హృదయపూర్వక క్షమాపణలు. అక్టోబర్ 9న మేము వస్తున్నామని చెప్పడం, ఇప్పుడు హఠాత్తుగా పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల ఆ డేట్‌ను నమ్ముకున్న చిన్న సినిమాల రిలీజ్‌లకు ఇబ్బంది కలిగించినందుకు కూడా సారీ చెప్తున్నాను' అని నాగవంశీ ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే సినిమా లేట్ అవ్వడం వల్ల వెంకటేష్ అభిమానులకు మరింత బెటర్ ప్రాజెక్ట్‌ను అందించే అవకాశం దక్కిందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. 'కొంచెం లేట్ అయినా సరే, వెంకీ అభిమానులు కాలర్ ఎగరేసుకునే రేంజ్ సినిమా ఇస్తాం. ఇక్కడ ప్రాబ్లం రాజమౌళి గారో లేదా త్రివిక్రమ్ గారో కాదు. సోషల్ మీడియాలో ఏ ఒక్కరూ వేలెత్తి చూపడానికి లేకుండా పర్ఫెక్ట్ సినిమా చేయాలనేదే మా తాపత్రయం. ఇటీవల విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రానికి కూడా నెగెటివ్ రాశారు. ఆ భయంతోనే ఇంకా ఇంకా క్వాలిటీ పెంచాల్సి వస్తోంది. అలాగే రేలంగి గారి పాటను స్ఫూర్తిగా తీసుకునే మేము ఈ సినిమాలో నారాయణమ్మ పాటను చేశాం, ఇందులో దాచడానికి ఏమీ లేదు' అని నిర్మాత వివరించాడు. సోషల్ మీడియా మీద ఉన్న భయంతో సేఫ్ ప్రాజెక్ట్ అందించాలనే ఈ ఎక్స్‌ట్రా కేరింగ్ తీసుకుంటున్నామని, ఈసారి ప్రొపర్ గా కాపీ చూసుకున్నాకే వెంకటేష్, సురేష్ బాబు గార్లతో మాట్లాడి కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని స్పష్టం చేశాడు.
Also Read:
నర్తకిగా పూజిత పొన్నాడ.. ఫస్ట్ లుక్ అదిరింది
'సప్త సాగరాలు సప్త గిరులు'గా తెలుగులో...
నాపై ఐటీ దాడులా.. అసలు నిజాలు తెలుసుకోరా?: రకుల్ ప్రీత్ సింగ్