సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: ఆ గ్యాప్ ను.. 'అఖండ 2' ఫిల్ చేస్తుందా!

ABN, Publish Date - Sep 03 , 2025 | 12:04 PM

రాబోయే నాలుగు నెలల్లో ప్రతి నెలలోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే నవంబర్ - డిసెంబర్ మాసాల్లో చాలా గ్యాప్ చిక్కుతోంది. ఆ ఖాళీని ఎవరు పూర్తి చేస్తారా అన్న ఆసక్తి సినీఫ్యాన్స్ లో నెలకొంది.

December movies

సెప్టెంబర్ లోకి అడుగు పెట్టేశాం. ఈ నెల 5వ తేదీన అనుష్కతో క్రిష్ తెరకెక్కించిన 'ఘాటీ' రిలీజ్ కానుంది. అదే రోజున ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటించిన 'మదరాసీ' కూడా వెలుగు చూడనుంది. అలానే చిన్న సినిమాలు 'లిటిల్ హార్ట్స్, లవ్ యు రా' కూడా 5నే రాబోతున్నాయి. తరువాతి వారంలో తేజ సజ్జా నటించిన 'మిరాయ్' కూడా జనం ముందుకు రానుంది. దీంతో పాటు 'కాంత, కిష్కింధపురి' కూడా విడుదల కానున్నాయి. అలానే డబ్బింగ్ సినిమాలు 'టన్నెల్', డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా - ఇన్ఫినిటీ క్యాసిల్ తో పాటు త్రికాలి మూవీ వస్తోంది. ఇక 19వ తేదీన 'బ్యూటీ, దక్ష, ధర్మవరం, కర్మణే వాధికారస్తే' తో పాటు విజయ్ ఆంఓటని తమిళ డబ్బింగ్ మూవీస్ 'భద్రకాళి' రాబోతోంది. ఇక సెప్టెంబర్ 25వ తేదీన పవన్ కళ్యాణ్ 'ఓజీ' గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.


అక్టోబర్ 2న కన్నడ క్రేజీ మూవీ 'కాంతార- చాప్టర్ 1' రిలీజ్ అనువాద రూపంలో విడుదలవుతోంది. అదే నెల 10న 'శశివదనే'తో పాటు ఆంగ్ల అనువాద చిత్రం 'ట్రాన్ ఆరీస్' వస్తోంది. ఇక అక్టోబర్ మూడోవారంలో 16న 'మిత్రమండలి', 17న రెండు డబ్బింగ్ మూవీస్ 'డ్యూడ్, ఎల్ఐకే' వస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించడం విశేషం. అదే రోజున తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'కె- ర్యాంప్' కూడా రానుంది.

అక్కడ నుండి నవంబర్ 28వ తేదీ దాకా ఏ క్రేజీ ప్రాజెక్ట్ కూడా డేట్ ను ఫిక్స్ చేసుకోలేదు. నవంబర్ 21న మాత్రం ఆంగ్ల అనువాద చిత్రం 'సిసు: రోడ్ టు రివేంజ్' రాబోతోంది. ఇక నవంబర్ 28న రామ్ పోతినేని నటించిన 'ఆంధ్రాకింగ్ తాలూకా' రానుంది. అదే రోజున మరో యానిమేషన్ మూవీ 'జూటోపియా -2' తెలుగువారిని పలుకరించనుంది. ఈ సినిమా తరువాత కూడా డిసెంబర్ లో చాలా గ్యాప్ వస్తోంది. అందువల్లే నవంబర్ లో ముందుగా కనిపిస్తోన్న ఖాళీని, డిసెంబర్ లో 19వ తేదీ దాకా కనిపించే గ్యాప్ ను ఎవరు క్యాష్ చేసుకుంటారా అని సినీఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


డిసెంబర్ 19న వస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ హాలీవుడ్ మూవీ 'అవతార్-3'. ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లోనూ రిలీజ్ కాబోతోందని టాక్. జేమ్స్ కేమరాన్ రూపొందించిన 'అవతార్' రెండు భాగాలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ఈ నేపథ్యంలో రాబోయే 'అవతార్ -3'పై భారీ అంచనాలున్నాయి. అయితే 19వ తేదీ దాకా గ్యాప్ బాగా ఉంది. అందువల్ల సెప్టెంబర్ 25 నుండి తప్పుకున్న 'అఖండ-2' డిసెంబర్ మొదటివారంలో వస్తే బాగుంటుందని సినీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇంతకు ముందు డిసెంబర్ 5న ప్రభాస్ 'ద రాజాసాబ్' ఉంటుందని ప్రకటించారు. ఆ సినిమాను జనవరి 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తునట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిసెంబర్ 5న 'అఖండ-2' వస్తే, 2021లో డిసెంబర్ 2న రిలీజై ఘనవిజయం సాధించిన 'అఖండ'లాగే గ్రాండ్ సక్సెస్ చూస్తుందని పలువురు భావిస్తున్నారు. కానీ, కొందరు 'అఖండ-2' కూడా సంక్రాంతికే వస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 25వ తేదీన అడివి శేష్ నటించిన 'డెకాయిట్' రానుంది. ఎలా చూసినా, నవంబర్ 28కి ముందు, డిసెంబర్ 19కి ముందు గ్యాప్ బాగా కనిపిస్తోంది.మరి ఈ టైమ్ ను ఎవరు క్యాష్ చేసుకుంటారో చూడాలి.

Also Read: SSMB29: 20 భాష‌లు, 120 దేశాల్లో.. SSMB29 రిలీజ్‌! లీక్ చేసిన కెన్యా మంత్రి

Also Read: Ghaati: పుల్ వ‌య‌లెన్స్‌, గంజా సీన్లు! ఆ.. స‌ర్టిఫికెట్ ఎలా తేగ‌లిగారు క్రిష్‌తో చిత్ర‌జ్యోతి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ

Updated Date - Sep 03 , 2025 | 01:25 PM