SSMB29: 20 భాషలు, 120 దేశాల్లో.. SSMB29 రిలీజ్! లీక్ చేసిన కెన్యా మంత్రి
ABN , Publish Date - Sep 03 , 2025 | 11:20 AM
భారతీయ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లబోతున్న భారీ ప్రాజెక్ట్ “ఎస్‌ఎస్‌ఎంబీ29” SSMB29 (గ్లోబ్‌ట్రాటర్) పై అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (mahesh babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో భారతీయ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లబోతున్న భారీ ప్రాజెక్ట్ “ఎస్‌ఎస్‌ఎంబీ29” SSMB29 (గ్లోబ్‌ట్రాటర్) పై అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అధికారిక అప్డేట్ల కోసం నిత్యం లక్షలాది మంది సినీ ప్రియులు ఎదురు చూస్తున్నా వారికి నిరాశే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి గరిక పోచ లాంటి అప్డేట్ తెలిసినా జనం ఏ మాత్రం వదలడం లేదు. ఫొటోలు వచ్చినా, రూమర్స్ వచ్చినా ఏ వార్త అయినా క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. చిత్ర బృందం ఇంతవరకు ఏ విషయంపై ప్రకటన చేయకున్నా ఈ మూవీకి రిలేటెడ్‌గా ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.
ఇలాంటి సమయంలోనే తాజాగా.. బుధవారం మేకర్స్ నుంచి ఓ అదిరిపేయే న్యూస్ వచ్చి ఇప్పుడు టోటల్ ఇండియన్ సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. మంగళవారం రాజమౌళి, నిర్మాతలు ఇతర చిత్ర బృందం కెన్యా (Kenya) మినిస్టర్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించకుంది. ఈ నేపథ్యంలోనే సంబంధిత మినిష్టర్ ముసలియా W ముదవాడి (Musalia W Mudavadi) తనను కలిసిన “ఎస్‌ఎస్‌ఎంబీ29” షూటింగ్, చిత్రం బృందం, రాజమౌళిల గురించి వివరిస్తూ తన సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ అకౌంట్‌లో ఆసక్తికర విషయాలు వెళ్లడించారు.
ఆ పోస్టు ప్రకారం..కెన్యాలోని మాసాయి మారా, నైవాషా, సాంబురు, అంబోసెలి లాంటి అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమా కోసం విస్తృతంగా షూట్ జరిగింది. రాజమౌళి టీమ్ 120 మంది టెక్నీషియన్స్‌తో కలసి ఈ ప్రాజెక్ట్ కోసం ఈస్ట్ ఆఫ్రికా అంతా తిరిగి (స్కౌటింగ్ చేసి), చివరికి కెన్యానే ప్రధాన కేంద్రంగా ఎంచుకుంది. ఆఫ్రికన్ సన్నివేశాల్లో దాదాపు 95% సన్నివేశాలు ఇక్కడే తెరకెక్కించనున్నట్లు తెలిపారు. అంతేగాక 120కి పైగా దేశాల్లో విడుదల చేయనున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షకులను చేరుకోగలదని భావిస్తున్నా అన్నారు.రాజమౌళి అండ్ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం మా కెన్యా దేశ ఔన్నత్యాన్ని, అతిథ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తుందని, దేశ ప్రతిష్టను ఈ సినిమా మరింతగా చాటబోతుంద చెప్పడానికి గర్విస్తున్నానని “ఎస్‌ఎస్‌ఎంబీ29”తో మా ప్రంపచాన్ని చూపేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుండగా.. మినిస్టర్ ప్రకటనను మిలియన్లలో లైక్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే మహేష్ కెరీర్‌లో 29వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మేకర్స్ ఇప్పటికే రానున్న నవంబర్‌లో బిగ్ అప్‌డేట్ రానుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో సినిమా పై క్రేజ్ మరింత పెరిగింది. ఈ “గ్లోబ్‌ట్రాటర్” మూవీ కోసం డిస్నీ, సోనీ పిక్చర్స్ వంటి హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ ప్రాజెక్ట్ పై చర్చలు జరుపుతున్నాయని టాక్ వినిపిస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో, 20 భాషల్లో ఈ సినిమా ఒకేసారి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.