Avatar 3: అవతార్‌3 ట్రైలర్ వ‌చ్చేసింది.. ఈ సారి అంత‌కు మించి

ABN , Publish Date - Jul 28 , 2025 | 08:48 PM

ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్‌’ ఫ్రాంచైజీకు ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే.

Avatar

'అవతార్ 3' కోసం అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ పడింది! ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న ‘అవతార్’ ఫ్రాంఛైజీ ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) మళ్లీ తన విజువల్ మాయాజాలంతో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటివరకు రెండు భాగాలు విడుదలై వందల కోట్ల వసూళ్లు సాధించిన ఈ సిరీస్‌... తాజాగా మూడో భాగంగా రూపొందుతున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Ash) సినిమాకి సంబంధించిన తాజా అప్‌డేట్‌తో మళ్లీ హైప్‌ను పెంచేసింది.

మూవీ విలన్ పాత్రగా పరిచయం కాబోతున్న ‘వరంగ్’ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఇటీవలే రిలీజ్ చేశారు. అగ్ని శక్తులతో కూడిన నెవీ గణానికి చెందిన వరంగ్ పాత్ర చాలా మిస్టీరియస్‌గా, ఇంటెన్స్‌గా ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. అభిమానుల్లో ఆసక్తి పెంచేలా ఈ లుక్ తీర్చిదిద్దారు.

మేకర్స్ ఇప్పటికే ప్రకటించినట్లుగా జూలై 25న రాత్రి 'అవతార్ 3' అధికారిక ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో కొత్త అగ్ని నెవీ తెగలు, పాండోరా మళ్ళీ ఎదుర్కొంటున్న మానవ ముప్పు, కొత్త ఎమోషనల్ కోణాలు అద్భుతంగా చూపించారు. గ‌త చిత్రాల‌ను మించే విధంగా విజువల్స్ ఉండి గూస్‌బంప్స్‌ తెచ్చేలా ఉన్నాయి. డిసెంబ‌ర్ 19న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది. 2029లో ‘అవతార్‌ 4’, చివరి ‘అవతార్‌ 5’ డిసెంబరు 2031 లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గతంలోనే ప్రకటించారు. 


Also Read.. ఇవి కూడా చ‌ద‌వండి

థియేట‌ర్ల‌లో.. నరసింహవ‌తారం సంచ‌ల‌నం! భ‌జ‌న‌లు, కీర్త‌న‌ల‌తో హంగామా

Ponnambalam: నా కష్టం.. పగవాడికి కూడా రాకూడదు

స‌రికొత్త‌గా.. వీర‌మల్లు! ఆ సీన్లు క‌ట్‌.. కొత్త‌వి ఇన్

కింగ్డ‌మ్ ట్రైల‌ర్‌.. అభిమానుల‌కు పూన‌కాలు

ఓటీటీకి వ‌స్తోన్న‌.. త‌మ్ముడు! జ‌నం కరుణించేనా

డైలాగ్ కింగ్‌ బ‌ర్త్ డే.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల సునామీ

ఆ ఓటీటీకి.. వీర‌మ‌ల్లు! ఎప్ప‌టినుంచంటే

Updated Date - Jul 28 , 2025 | 10:09 PM