Akhanda 2 : బాలయ్య సరసన సంయుక్త
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:08 AM
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అఖండ 2.. తాండవం’. ఈ సినిమాలో కథానాయికగా సంయుక్త మీనన్‌ను
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అఖండ 2.. తాండవం’. ఈ సినిమాలో కథానాయికగా సంయుక్త మీనన్‌ను ఎంపిక చేసినట్లు నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట చెప్పారు. హీరోయిన్లను అద్భుతమైన పాత్రల్లో చూపించే బోయపాటి శ్రీను సంయుక్త కోసం ఓ కీలక పాత్ర సిద్ధం చేశారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీత దర్శకుడు. సి.రామ్‌ప్రసాద్ ఛాయాగ్రాహకుడు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.