Vijay Sethupathi: పూరి సేతుప‌తి సెట్‌లో.. స‌ర్ మేడ‌మ్‌సెల‌బ్రేష‌న్స్‌

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:03 AM

విజ‌య్ సేతుప‌తి నూత‌న చిత్రం స‌ర్ మేడ‌మ్ సెల‌బ్రేష‌న్స్ పూరి జ‌గ‌న్నాథ్ కార్యాల‌యంలో నిర్వ‌హించారు.

Vijay Sethupathi

నిత్యం వైవిధ్య‌భ‌రిత‌ సినిమాల‌తో అల‌రిస్తున్న త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi). తాజాగా త‌లైవ‌న్‌, త‌లైవి (స‌ర్ మేడ‌మ్) అనే త‌మిళ అనువాద చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న తెలుగులో పూరి జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) తో క‌లిసి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సంయుక్త మీన‌న్ (Samyuktha) క‌థానాయిక‌గా చేస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ స్టార్ట్ చేసి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు.

Vijay Sethupathi

అయితే విజ‌య్ సేతుప‌తి రీసెంట్ సినిమా త‌లైవ‌ర్ త‌లైవి (స‌ర్ మేడ‌మ్ Sir Madam) ఈ రోజు (శుక్రవారం) థియేట‌ర్ల‌లో విడుద‌లై త‌మిళంలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో చార్మీ (Charmme Kaur), పూరి (Puri Jagannadh) స‌మ‌క్షంలో హైద‌రాబాద్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi)తో పాటు పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ వారి సినిమా బృందం (#PuriSethupathi) పాల్గొంది. ఇదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.

ఇదిలాఉంటే.. ఈ సినిమా తెలుగు వ‌ర్ష‌న్ స‌ర్ మేడ‌మ్‌ను చివ‌రి ద‌శ‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌ను విర‌మించుకున్న‌ట్లు తెలుస్తోండ‌గా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయున్న‌ట్లు స‌మాచారం.


Also Read.. ఇవి కూడా చ‌ద‌వండి.. బావుంటాయ్‌

ఓటీటీలో.. డ‌కోటా జాన్స‌న్ రొమాంటిక్ డ్రామా! కుర్రాళ్లకు పండ‌గే

వార్‌2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎన్టీఆర్ దుమ్ము దులిపేశాడు

ప‌వ‌న్ కళ్యాణ్‌: రెండు రోజులుగా.. నిద్ర లేదు

ప‌వ‌న్ కళ్యాణ్‌తో ఫొటో.. ఎగిరి గంతేసిన అభిమాని! వీడియో వైర‌ల్

OTTకి వ‌చ్చేసిన.. అదిరిపోయే లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్

ఆ ఓటీటీకి వ‌చ్చిన‌.. న‌వీన్ చంద్ర ఫ్యామిలీ థ్రిల్ల‌ర్

Updated Date - Jul 25 , 2025 | 01:07 PM