Materialists: ఓటీటీకి వచ్చేసిన.. డకోటా జాన్సన్ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా
ABN , Publish Date - Jul 24 , 2025 | 04:14 PM
గత నెలలో థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన ఇంగ్లీష్ చిత్రం మెటీరియలిస్ట్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
గత నెలలో థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన ఇంగ్లీష్ చిత్రం మెటీరియలిస్ట్ (Materialists). హాలీవుడ్ టాప్ స్టార్స్ డకోటా జాన్సన్ (Dakota Johnson), పెడ్రో పాస్కల్ (Pedro Pascal), క్రిస్ ఎవాన్స్ (Chris Evans) లీడ్ రోల్స్‌లో నటించారు. గతంలో వీల్ ఆఫ్ టైమ్ (The Wheel of Time) అనే వెబ్ సిరీస్, పాస్ట్ లైవ్స్ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సెలిన్ సాంగ్ (Celine Song) ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. సుమారు 20 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం జూన్ 13న రిలీజై బాక్సాఫీస్ వద్ద 52 మిలియన్ డార్లకు పైగా వసూల్లు రాబట్టి మంచి విజయం సాధించింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది కానీ కొంతమందికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
కథ విషయానికి వస్తే.. లూసీ నటిగా గుర్తింపు తెచ్చుకోలేక న్యూయార్క్ సిటీలో అడోర్ అనే మ్యాచ్ మేకింగ్ కంపెనీలో ప్రొఫెషనల్ మ్యాచ్ మేకర్‌గా పని చేస్తూ ఉంటుంది. తన వద్దకు వచ్చే జంటలకు వారి స్థితి గతులను బట్టి డేటింగ్, మ్యారేజ్ లాంటివి సెట్ చేస్తూ ఉంటుంది. అయితే.. అంతకుముందే అర్థిక స్థితి సరిగ్గా లేక తన తోటి నటుడు (జాన్ ఫించ్)తో బ్రేకప్ చేసుకుని సింగిల్‌గా లైఫ్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇక జీవితాంతం ఒంటరిగా ఉంటా.. లేకుంటే డబ్బున్న వాడినే పెళ్లి చేసుకుంటా అనే బలమైన నిశ్చయంతో ఉంటుంది. ఈ క్రమంలో హ్యారీ అనే ఓ మిలియనీర్‌తో పరిచయం ఏర్పడి వారిరువురు రిలేషన్ షిప్ స్టార్ట్ చేస్తారు. అదే సమయంలో మాజీ లవర్ ఫించ్ తిరిగి లూసీకి ఎదురు పడతాడు. ఈ నేపథ్యంలో లూసీ ఏం చేసింది హ్యారీతో రిలేషన్ కంటిన్యూ చేసిందా లేక తిరిగి ఫించ్ వద్దకు వచ్చింతా అనేప ఆయింట్‌తో సినిమా ఉంటుంది.
డబ్బు అవసరమా, ప్రేమ అవసరమా ఏది ముఖ్యం అనే పాయింట్ చుట్టూ సినిమా తిరుగతూ చూసే వారికి ఫీల్‌గుడ్ మూవీ చూశామనే తృప్తి లభిస్తుంది. కథనం స్లోగా సాగినా ఎక్కడా బోర్ కొట్టకుండా ముగ్గురు నటులు తమ నటనతో మెస్మరైజ్ చేస్తారు. ముఖ్యంగా సినిమాను ఎక్కువ శాతం పదునైన డైలాగ్స్ డామినేట్ చేస్తాయి. ఆపై హృదయాన్ని తాగే భావోద్వేగాలతో మూవీ సాగుతుంది.
ఇప్పుడీ మెటీరియలిస్ట్ (Materialists) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంట్ పద్దతిలో కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే అది కూడా ప్రస్తుతానికి బయటి దేశాల్లోనే అందుబాటులో ఉంది. మరో వారం తర్వాత మన దేశంలోనూ స్ట్రీమింగ్ అవనుంది.మూవీలో ముద్దులు, ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నందు వల్ల పిల్లలకు దూరంగా కేవలం లవర్స్, పెద్ద వారు మాత్రమే ఈ చిత్రం చూడడం బెటర్. అయితే ఇండియా లో కొన్ని థర్డ్ పార్టీ యాప్స్, అన్‌లైన్ ఫ్రీ వెబ్‌సైట్లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.