Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో ఫొటో.. ఎగిరి గంతేసిన అభిమాని! వీడియో వైరల్
ABN , Publish Date - Jul 25 , 2025 | 05:27 AM
పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సక్సెస్ మీట్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రం నిన్న (గురువారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సర్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో చిత్ర బృందం నిన్న సాయంత్రం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్బంగా పవన్ పలు అసక్తికర వ్యాక్యలు సైతం చేశారు. అలాగే సినిమాప వస్తున్న కామోంట్లకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. అయితే కార్యక్రమం సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను ఒకసారి కళ్లారా చూడాలని, ఫోటో దిగాలని కోట్లలో అభిమానులు ఎగబడుతుంటారు. ఎంత కష్టమైనా వెనకాడరు. అలాంటిది నిన్న జరిగిర ఈవెంట్‌లో పవన్ మాట్లాడుతుండగా ముందు వరుసలో నిల్చున్న నివిక అనే ఆర్టిస్టును గుర్తించి మీరు హరిహర వీరమల్లు సినిమాలో నటించారు కదా అని అడగి ఆమెను స్టేజీకి పైకి ఆహ్వానించారు. ఆపై నివిక గురించి నిధి ఆగర్వాల్‌కు పరిచయం చేసి బాగా నటించారు అంటూ కితాబిచ్చారు. అనంతరం నివిక ఇంకా నాకు షాకింగ్‌గా ఉందని, మీ అభిమానినని నాకు ఓ ఫోటో కావాలని కోరగా పవన్ ఫొటోలు దిగారు. అనూహ్యంగా నిమిషాల వ్యవధిలో జరిగిన ఘటనకు ఆమె షాక్‌కు గురై ఆనందం పట్టలేక స్టేజీపైనే ఎగిరి గంతేసింది.
ఈ సన్నివేశం అక్కడ ఉన్నవారిని కూడా ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. ప్రతి సారి పవన్ ప్రజల్లోకి వస్తే అభిమానులు ఆయనను చూసేందుకు ఎంతలా పోటీ పడతారనే విషయం ఈ సంఘటన మరో సారి రుజువు చేయగా పవన్ ఎంత ప్రజాదరణ ఏ రేంజ్‌లో ఉంటుందనేది ఈ ఘటన మరోసారి నిరూపించింది. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సినిమాలు, అభిమానులపై చూపించే ప్రేమకు అభిమానులు ఫిదా అవుతున్నారు.