SHOW TIME OTT: ఆ ఓటీటీకి వ‌చ్చిన‌.. న‌వీన్ చంద్ర ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌

ABN , Publish Date - Jul 25 , 2025 | 08:11 AM

ఇప్ప‌టికే గ‌త నెల‌లో బ్లైండ్ స్పాట్‌, ఎలెవ‌న్ అంటూ వ‌రుస థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో వ‌చ్చి అల‌రించిన‌ ప్రామిసింగ్ యాక్టర్ నవీన్ చంద్ర న‌టించిన కొత్త చిత్రం షో టైమ్.

SHOW TIME

ఇప్ప‌టికే గ‌త నెల‌లో బ్లైండ్ స్పాట్‌, ఎలెవ‌న్ అంటూ వ‌రుస థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో వ‌చ్చి అల‌రించిన‌ ప్రామిసింగ్ యాక్టర్ నవీన్ చంద్ర (Naveen Chandra) న‌టించిన కొత్త చిత్రం షో టైమ్ (Show Time). ఈ చిత్రం ఈ నెల (జూలై 4)న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఫ‌ర్వాలేద‌నిపించుకుంది. కామాక్షి భాస్క‌ర్ల (Kamakshi Bhaskarla), న‌రేశ్ విజ‌య కృష్ణ (VK Naresh), రాజా ర‌వీంద్ర (Raja Ravindra) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌ముఖ నిర్మాత అనిల్‌ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిశోర్‌ గరికపాటి ఈ చిత్రాన్ని నిర్మించ‌గా మదన్‌ దక్షిణామూర్తి ( Madhan Dakshinamurthy) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శేఖర్‌ చంద్ర సంగీతం, శ్రీనివాస్ గ‌విరెడ్డి డైలాగ్స్‌ అందించారు.ఇప్పుడీ సినిమా రెండు వారాల‌కే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

సూర్య (నవీన చంద్ర), శ్రుతి (కామాక్షి భాస్కర్) (Kamakshi Bhaskarla) ఓ పాప‌తో కుటుంబాన్ని హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు. అయితే.. ఓ రోజు రాత్రి బిల్డింగ్ లోని ఫ్యామిలీస్ అంతా కలిసి పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. అదే సమయంలో అటు పెట్రోలింగ్ కు వచ్చిన సీఐ లక్ష్మీకాంత్ (రాజా రవీంద్ర), అతని అసిస్టెంట్‌కు.. సూర్యకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. సివిక్ సెన్స్ లేకుండా మిడ్ నైట్ పార్టీలు జరుపుకోవడంపై సీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ మర్నాడు సూర్య కూతురు మెడలో గొలుసును ఒకడు లాక్కుపోతుంటే అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా అతను ప్రమాదవశాత్తు మ‌ర‌ణిస్తాడు. దాంతో అతని శవాన్ని ఎవరికీ కనిపించకుండా ఇంట్లో దాస్తారు.

SHOW TIME

ఈ లోగా రాత్రి జరిగి రాద్ధాంతంతో పోలీసులు మరోసారి సూర్య ఇంటికి వ‌స్తారు. అదే సమయంలో సూర్య అత్తమామలు అక్కడికి బయలు దేరతారు. ఈ వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలియక లాయర్ వరదరాజులు (నరేష్‌) సాయం కోరతాడు సూర్య. అనుకోకుండా చేసిన హత్య నుండి సూర్య బయట పడ్డాడా? సూర్య పై కక్ష కట్టిన పోలీసులు అతన్ని ఎలాంటి వేదింపులకు గురిచేశారు? సరదాగా స్నేహితులతో జరుపుకునే మిడ్ నైట్ పార్టీతో సూర్య ఎదుర్కొన్న ఇబ్బందులేమిటీ? వీటి నుండి అతను ఎలా బయట పడ్డాడు? అనేది మిగతా కథ.

ఒకటి రెండు రోజుల్లో జరిగే కథ నేప‌థ్యంలో ఈ సినిమాలో.. థ్రిల్లర్ స్టోరీని వీలైంత వినోద ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రథమార్థం నిదానంగా సాగడం కాస్త‌ బోర్ కొట్టించినా క్లయిమాక్స్ దగ్గరకు వచ్చేసరికి మంచి స‌స్పెన్స్ తో సీటులో కూర్చోబెడ‌తారు. ఒక చిన్న పొరపాటు జరిగినా.. మధ్య తరగతి మనుషులు ఎలా తడబడిపోతారు, భయపడిపోతారు అనే దాన్ని బాగా చూపించారు. మాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఇప్పుడీ సినిమా రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే ఓటీటీల్లో కాకుండా స‌న్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది. మంచి థ్రిల‌ర్ కావాల‌నుకునే వారికి ఈ షో టైమ్ (Show Time) చిత్రం మంచి కిక్ ఇస్తుంది.


Also Read.. ఇవి కూడా చ‌ద‌వండి.. బావుంటాయ్‌

ఓటీటీలో.. డ‌కోటా జాన్స‌న్ రొమాంటిక్ డ్రామా! కుర్రాళ్లకు పండ‌గే

వార్‌2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎన్టీఆర్ దుమ్ము దులిపేశాడు

రెండు రోజులుగా.. నిద్ర లేదు

ప‌వ‌న్ కళ్యాణ్‌తో ఫొటో.. ఎగిరి గంతేసిన అభిమాని! వీడియో వైర‌ల్

OTTకి వ‌చ్చేసిన.. అదిరిపోయే లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్

Updated Date - Jul 25 , 2025 | 11:55 AM