War2 Trailer: వార్2 ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ దుమ్ము దులిపేశాడు
ABN , Publish Date - Jul 25 , 2025 | 10:25 AM
హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్2 ట్రైలర్ విడుదలైంది.
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) నటించి భారీ బడ్జెట్ చిత్రం వార్2 (War 2). మరో నెల రోజుల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. బ్రహ్మాస్త్ర తర్వాత అయాన్ ముఖర్జీ (Ayan mukharji) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం గమనార్హం. ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
అంతేగాక హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘వార్ 2’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj films) సంస్థ ఇప్పటికే వెల్లడించింది. ఈ క్రమంలో వీరు చెప్పినట్లుగానే సరిగ్గా శుక్రవారం ఉదయం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే ముందుగా వచ్చిన టీజర్‌ను మించి విజువల్ గ్రాండియర్గా ఉంది. యాక్షన్ సీన్స్ హాలీవుడ్ లెవల్‌లో, మొదటి భాగాన్ని మించి సన్నివేశాలు తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము లేపుతోంది. కియారా గ్లామర్‌తోనే కాకుండా యాక్షన్ సీన్లలోనూ అదరగొట్టింది.
ఇదిలాఉంటే.. ఈ మూవీలో యశ్‌రాజ్ యూనివర్స్ చిత్రాల నుంచి పలు సర్‌ప్రైజ్‌లు ఈ సినిమాలో సర్‌ఫ్రైజ్ క్యామియోలు ఉండనున్నట్లు సమాచారం.ఇక వార్2 మరో 20 రోజుల్లో రిలీజ్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సుదర్శన్ థియేటర్ వద్ద ప్యాన్స్ చెలరేగి పోయారు. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, హరతులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారిని ఆపడం ఇప్పట్లో కుదరదనేలా వారు హంగామా సృష్టిస్తున్నారు. ఇది ఇలానే సినిమా రిలీజ్ వరకు కొనసాగేలా తెలుస్తోంది.