Pawan Kalyan: రెండు రోజులుగా.. నిద్ర లేదు

ABN , Publish Date - Jul 24 , 2025 | 09:20 PM

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం బృందం గురువారం సాయంత్రం స‌క్సెస్ మీట్ నిర్వ‌హించింది.

Pawan Kalyan

ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (Hari Hara Veera Mallu) చిత్రం బుధ‌వారం పెయిడ్ ప్రీమియ‌ర్స్‌తో విడుద‌లై అంత‌టా విజ‌యవంతంగా ర‌న్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు చిత్ర బృందం గురువారం సాయంత్రం స‌క్సెస్ మీట్ (Success Meet) నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. "సక్సెస్ మీట్ లు నాకు అలవాటు లేదు. క్యాబినెట్ మీటింగ్ లో నా పంచాయితీ శాఖ గురించి మాట్లాడతాను అనుకున్నాను. కానీ సినిమా పంచాయితీలు కూడా చేస్తాననుకోలేదు. నా జీవితంలో ఏదీ ఈజీగా రాలేదు" అని అన్నారు.

గత రెండు రోజులుగా సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాను. సరైన నిద్ర లేదు. భగవంతుడు నాకు నీ సినిమాను ప్రమోట్ చేసుకో అనీ అవకాశం ఇచ్చాడు. సినిమా జయాపజయాలను నేను తలకు ఎక్కించుకోను అని పవన్ స్పష్టం చేశారు. అయితే.. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ లో కొన్ని గ్లిచెస్ ఉండొచ్చు. కానీ ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ అయిందనేది ముఖ్యం. చిన్నప్పుడు చదివిన కథలు వేరు, జరిగినవి వేరు. జిజియా పన్ను గురించి నేను చిన్నప్పుడే చదివాను. ఆ విషయం ఈ సినిమా చేస్తుంటే గుర్తొచ్చిందన్నారు.

"చరిత్రలో అక్బర్ ది గ్రేట్ అంటాము కానీ కృష్ణదేవరాయులు జై, రాణీ రుద్రమదేవి జై అనము. ఇంతా చేసి మొఘలులు పాలించింది రెండొందల ఏళ్లు మాత్ర‌మే, చరిత్ర అలా రాశారు. కేవలం పాజిటివ్ సైడ్ నే నూరి పోశారు‌. ఔరంగజేబు గురించి మాట్లాడితే సెన్సిటివ్ మ్యాటర్ గా చూస్తారు. కానీ ఆయన ఎంతో మందిని చంపాడు, ఇబ్బంది పెట్టాడు. అందుకే ఔరంగజేబ్ డార్క్ సైడ్ ను చూపించాలని ఈ కథలో ఎక్స్‌పాండ్ చేశామని, ఇది గుడ్ వర్సెస్ బ్యాడ్, కమ్యూనల్ డిఫరెన్స్ కాదు" అని ఇలాంటి ఒక సినిమా చేసినందుకు గర్వంగా ఉందని పవన్ స్పష్టం చేశారు. హరి హర వీరమల్లు రెండు పార్ట్స్ గా చేయాలని అనుకున్నామ‌ని, అందులో భాగంగా పార్ట్ 2లో 20-30 శాతం ఇప్పటికే పూర్తయ్యిందని అవ‌కాశం వ‌స్తే రెండో పార్ట్ కూడా త్వ‌ర‌లోనే తీస్తామ‌ని అన్నారు. ఇక ఈ సినిమా విడుద‌ల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మైన మైత్రి రవి, నవీన్, పీపుల్ మీడియా విశ్వప్రసాద్ కి ప్ర‌త్యేక‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక‌.. ఈ సినిమాను కొందరు బహిష్కరిస్తామని అంటున్నారు. ఎస్ చేయండి. నేను పెద్ద స్థాయికి ఎదిగాను, మిమ్మల్ని భయపెట్టే స్థాయికి ఎదిగాను. ఎవడికి భయమూ లేదు. నా అభిమానుల బలం వల్లే ఇదంతా సాధ్యమైంది అన్నారు. మన సినిమా గురించి నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు అంటే మనం బలంగా ఉన్నామనే అర్థం. నాకు డిప్రెషన్ ఉండదు..‌ధైర్యం మాత్రమే ఉంటుంది..మేము మొఘలుల చేసిన మంచి కాదు చెడు గురించి చూపించాం. పాజిటివ్ సైడ్‌ను మాత్రమే చూపించలేదు. నేను సినిమాలో అన్నింటినీ అడ్రస్ చేయడం బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అని చెప్పారు.

నేను కలెక్షన్స్ దగ్గర ఆగిపోను. సినిమా అనేది ఇంపాక్ట్. అది మనతో ఎలా కనెక్ట్ అవుతుందనేది ముఖ్యం. హరి హర వీరమల్లు ఆ రీచ్ సాధించింది ఫీడ్‌బ్యాక్‌ని పరిగణనలోకి తీసుకొని . పార్ట్ 2లో జాగ్రత్తలు తీసుకుంటాము" అని స్పష్టం చేశారు. "అభిమానులు సెన్సిటివ్‌గా ఉండకండి. హ్యాపీగా మీ జీవితాన్ని ఆస్వాదించండి. ఈ సినిమా నాదో, రత్నం గారిదో కాదు. ఇది మన దేశ చరిత్రకు సంబంధించినది. కోహినూర్ పగిలినా పర్లేదు, మన సాంస్కృతిక వారసత్వం కొనసాగాలి. నేను 2019లో ఓడిపోయినప్పుడు నేను ఎంత‌ అవమానపడతానో అనుకున్నారు. కానీ చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావడమే గొప్ప విజయం. నేను జీవితాన్ని కాదు మానవత్వాన్ని, బంధాలను సీరియస్‌గా తీసుకుంటాను. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచండి" అన్నారు.


Also Read.. ఇవి కూడా చ‌ద‌వండి.. బావుంటాయ్‌

ఓటీటీలో.. డ‌కోటా జాన్స‌న్ రొమాంటిక్ డ్రామా! కుర్రాళ్లకు పండ‌గే

వార్‌2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎన్టీఆర్ దుమ్ము దులిపేశాడు

ప‌వ‌న్ కళ్యాణ్‌తో ఫొటో.. ఎగిరి గంతేసిన అభిమాని! వీడియో వైర‌ల్

OTTకి వ‌చ్చేసిన.. అదిరిపోయే లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్

ఆ ఓటీటీకి వ‌చ్చిన‌.. న‌వీన్ చంద్ర ఫ్యామిలీ థ్రిల్ల‌ర్

Updated Date - Jul 25 , 2025 | 11:59 AM