సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi: సురేఖ ఎంట్రీ.. చిరు ఫోకస్ షిఫ్ట్

ABN, Publish Date - Sep 11 , 2025 | 06:47 PM

సూపర్ స్టార్ అయినా, మెగాస్టార్ అయినా.. హోం మినిస్టర్ ముందు టెన్షన్ పడాల్సిందేనా.. అంటే అవుననే అనాల్సి వస్తోంది. భార్యమణి ముందు ఎవరైనా వణికిపోవాల్సిందేనని తాజాగా మరోసారి మెగాస్టార్ ప్రూవ్ చేశారు.. ఏంటి.. హోం మినిస్టర్ అంటున్నారు.. మెగాస్టార్ అంటున్నారు.. లింక్ లేకుండా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా.. ఈ స్టోరి చదివితే మీకే క్లారిటీ వస్తుంది.

బిగ్ స్క్రీన్ పై ఎంతటివారినైనా భయపెట్టే హీరోలు... రియల్ లైఫ్ లో అందుకు రివర్స్ లో ఉంటారనే విషయం మరోసారి రుజువైంది. ముఖ్యంగా భార్యల ముందు ఎవరైనా టెన్షన్ పడాల్సిందే అని తేలిపోయింది. మెగాస్టార్ అయినా సూపర్ స్టార్ అయినా.. మరో స్టార్ ఎవరైనా అందరూ అంతేనని ప్రూవ్ అయింది. సరిగ్గా ఇలాంటి విషయాన్నే మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) గురించి ఆయన పెద్ద కూతురు సుస్మిత కొణిదెల (Sushmita Konidela ) బయటపెట్టి విషయం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.


'కిష్కింధపురి' (Kishkindhapuri) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ కు సుస్మిత కొణిదెల స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. తనకు హారర్ మూవీలు చాలా ఇష్టమని చెప్పి, ట్రైలర్ బాగుందని కితాబిచ్చారు. ఇదే సందర్బంలో యాంకర్ సుమ (Suma) హారర్ సినిమాల్లో భయపెట్టే సీన్స్ ఏవి.. నువ్వు భయపడేవి ఏమిటని అడగ్గా..సుస్మిత ఫన్నీ రిప్లై ఇచ్చింది. ఆడవాళ్లు భయపెట్టే వాళ్లే తప్ప, భయపడేవాళ్లు కాదు అని జోక్ చేసింది. వెంటనే సుమ.. చిరంజీవి కి సురేఖ (Surekha) అంటే భయమా అని అడగ్గా.. సుస్మిత ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను షేర్ చేసుకుంది.

రీసెంట్ గా 'మన శంకరవరప్రసాద్ గారు' (Mana Shankara Varaprasad Garu) సినిమాలో ఒక పాట షూటింగ్ చేస్తున్నారట. చిరంజీవి గారు డ్యాన్స్ స్టెప్స్ పర్ఫెక్ట్‌గా చేస్తుండగా... ఆయన భార్య సురేఖ సడన్‌గా సెట్‌కు వచ్చేయగా... తనను చూసి మెగాస్టార్ స్టెప్స్ మర్చిపోయి తడబడిపోయారట. ఇదంతా అమ్మ చూస్తున్నందుకే జరిగిందని సుస్మిత ఫన్నీగా చెప్పారు. ఈ మాటలతో ఈవెంట్ లో ఉన్నవారంత నవ్వేశారు. సుస్మిత షేర్ చేసిన ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా రకరకాల కామెంట్ల వర్షం కురుస్తోంది.

Read Also: Chiranjeevi - VIjay Polaki: కట్టె కాలే దాకా చిరు అభిమానినే.

Read Also: Two Much: కాజోల్, ట్వింకిల్.. 'టూ మచ్' షో! ఎప్ప‌టినుంచంటే

Updated Date - Sep 11 , 2025 | 07:34 PM