Mirai Twitter X RevIew: తేజ సజ్జా.. మిరాయ్ ట్విట్టర్ రివ్యూ! ఎలా ఉందంటే
ABN , Publish Date - Sep 12 , 2025 | 07:47 AM
ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది సోసియో ఫాంటసీ అడ్వంచరస్ చిత్రం మిరాయ్.
ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది సోసియో ఫాంటసీ అడ్వంచరస్ చిత్రం మిరాయ్ (Mirai). తేజ సజ్జా (Teja Sajja), మంచు మనోజ్ (Manoj Manchu), జయరాం, జగపతిబాబు, రితిక నాయక్ (Ritika Nayak), శ్రీయ వంటి భారీ తారాగణం నటించగా ఈగల్ వంటి టెక్నికల్ బ్రిలయన్స్ సినమా తర్వాత కార్తీక్ ఘట్టమనేని (KarthikGattamneni) దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. సినిమా విడుదలకు ముందు నుంచి వచ్చిన హైప్, టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఒకదాన్ని మించి మరోటి అనుకున్నదాన్ని మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. సాన్ ఇండియాగా వచ్చిన ఈ సినిమాపెయిడ్ ప్రీమియర్స్ గురువారం రాత్రే పడిపోగా ఇప్పటికే చాలామంది మూవీ చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. ఆరంభం నుంచి మరో మాట లేకుండా డైరెక్ట్ సినిమాలోకి తీసుకెళ్లారని, ఫస్టాప్ కాస్త కామెడీ కోసం ట్రై చేసినా అంతా ఉపయోగం ఉండదని, ఇంటర్వెల్, ఫ్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అన్నీ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయని అంటున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్, వీఎఫ్ఎక్స్ (VFX ) విజువల్స్ టాప్‌నాచ్‌గా ఉన్నాయని ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే గతంలో రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర తరహా స్టోరీ, పాత్రలు అనిపించినా దానిని తలదన్నేలా సినిమాను రూపొందించారని, ఇది ఓ టెక్నికల్ బ్రిలియన్స్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. తేజ సజ్జా, మంచు మనోజ్ ఫేస్ ఆఫ్ సీన్లు గూస్‌బంప్స్ తెచ్చేలా ఉన్నాయని, సినిమాలో ప్రభాస్4 నిమిషాల వాయిస్ ఓవర్‌థో సర్‌ప్రైజ్ చేశారని ఆ వాయిస్‌తో ఒక్కసారిగా దద్దరిల్లి పోయాయని, ఈ సినిమాతో తెలుగువారి పవర్‌ను మరో సారి దేశానికి రుచి చూపించారని అంటున్నారు.
ఇక ఇది మస్ట్‌గా ఫ్యామిలీతో, థియేటర్లో ఎక్స్ఫీరియన్స్ చేయాల్సిన చిత్రమని, చివర్లో ఇచ్చిన రాముడి ఎంట్రీ స్టన్నింగ్‌గా ఉందని, ఫర్‌ఫెకట్్ సెట్ అయిందని చెబుతున్నారు. అక్కడక్కడ కాస్త లాగ్ అనిపించినప్పటికీ సినిమా మాత్రం బావుందని అంటుండగా మరికొందరు సోషల్ మీడియా అంతా పీఆర్ పబ్లిసిటీలతో నిండి పోయిందని, ఏది నిజం ఏది అబద్దమో అంతా గజిబిజి గందరగోళంగా ఉందని, మిరాయ్ (Mirai) సినిమా మాత్రం సోసోగా ఉందని ప్రచారంలో ఉన్నంత సరుకు హైలో లేదని ఆడియన్స్ తొందరపడొద్దని హితవు పలుకుతున్నారు. ఇదిలాఉంటే అనేక మంది చాలా రకాలుగా రియాక్ట్ ఈవుతనన్ప్పటికీ ఇప్పటికే చాలా సెంటర్లలో షోలు ప్రారంభం అవడం, ఇప్పటికే సోషల్ మీడియాలో బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్లు, రీట్వీట్లతో తెగ వైరల్ అవుతున్నాయి.