Paradha OTT: సడన్‌గా.. ఓటీటీకి వచ్చి షాకిచ్చిన పరదా! రెండు వారాలకే
ABN , Publish Date - Sep 12 , 2025 | 07:00 AM
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటించగా గత నెలలో థియేటర్లకు వచ్చిన ప్రయోగాత్మక చిత్రం పరదా.
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్‌లో నటించగా గత నెలలో థియేటర్లకు వచ్చిన ప్రయోగాత్మక చిత్రం పరదా (Paradha). దర్శనా రాజేంద్రన్ (darshana rajendran), సంగీత (Sangeetha), రాగ్ మయూర్, ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ఆగస్టు 22న ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన ఈ చిత్రం ఓ మేరకు పాజిటివ్ తాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రజలకు రీచ్ కాలేకపోయింది. అనుపమా అంతా తానే అయి కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రమోషన్స్ చేసినప్పటికీ అంతగా ప్రజాధరణ దక్కించుకోలేక పోయింది. గతంలో సినిమాబండి, సమంతతో శుభం వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రవీణ్ కండ్రేగుల (Praveen kandregula) ఈ చిత్ర దర్శకుడు. అయితే ఈ చిత్రం ఇప్పుడు పూర్తిగా రెండు వారాలు కూడా గడవకు మునుపే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. ఒకనొకప్పుడు పడతి అనే గ్రామంలో జ్వాలమ్మ గ్రామ దేవత. గర్భిణిగా ఉన్న ఆ దేవత ఓ విపత్కర పరిస్థితుల్లో శత్రువులను చంపి ఆత్మాహుతి చేసుకుంటుంది. నాటి నుంచి ఆ గ్రామంలో ఈడొచ్చిన అమ్మాయిలు బయటకు వస్తే పరదా కప్పుకునే సంస్కృతి స్టార్ట్ అవుతుంది. అలా చేయకుంటే ఆత్మాహుతి చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో లవర్స్ అయిన సుబ్బలక్ష్మీ (అనుపమా పరమేశ్వరన్), రాజేశ్ (రాగ్ మయూర్)లకు పెద్దలు పెళ్లి నిశ్చయిస్తారు. సరిగ్గా అప్పుడే సుబ్బలక్ష్మీ ఫొటో ఒకటి ఓ ఇంగ్లీష్ మ్యాగ్జైన్‌లో రావడంతో పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసి ఆత్మాహుతి చేసుకోవాలని డిసైడ్ చేస్తారు. అయితే.. ఆ ఫొటో విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరు, ఎందుకు తీశారనేది తెలుసుకుంటానని అతనిని వెతికే క్రమంలో ఉత్తర భారతంలో ధర్మశాల వరకు వెళ్లాల్సి వస్తుంది.
ఈ క్రమంలో మధ్యలో రత్న(సంగీత), అమిష్ట(దర్శన రాజేంద్రన్) సైతం తోడవుతారు, అసలు వాళ్ళెవ్వరు? సుబ్బు పరదా తీసిందా? పరదా తీస్తే జ్వాలమ్మ శాపానికి గురైందా?, అనే కథకథనాలతో సినిమా సాగుతుంది. ఓ మాములు అమాయక గ్రామీణ మహిళ ఎలా ధైర్యవంతురాలిగా మారింది అనే పాయింట్ అధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కథ మనం ఉందే ఊహించేలా ఉన్నప్పటికీ నటీనటుల ఫెర్మమెన్స్ తో ఆకట్టుకుంటారు, విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్. ఇప్పుడీ పరదా (Paradha) సినిమా సడన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అనుపమా ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చే అవకాశం ఉంది. థియేటర్‌లో మిస్సయిన వారు ఒక్కమారు ప్రయత్నించ వచ్చు.