Two Much: కాజోల్, ట్వింకిల్.. 'టూ మచ్' షో! ఎప్ప‌టినుంచంటే

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:05 PM

అందరికీ సుప‌రిచిత‌మైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా తొలిసారిగా కలిసి ఓటీటీ షో చేయబోతున్నారు.

Two Much

అందరికీ సుప‌రిచిత‌మైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా తొలిసారిగా కలిసి ఓటీటీ షో చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ప్రైమ్ వీడియో (Prime VideoIN) తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

“టూ మచ్” (Two Much) అనే పేరుతో రానున్న‌ ఈ కొత్త టాక్ షో సెప్టెంబర్ 25 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమ్ కానుందని తెలిపింది. అదేవిధంగా.. ప్ర‌తి గురువారం ఓ కొత్త ఎపిసోడ్‌ను విడుదల చేయనుండ‌గా ప్రముఖ బాలీవుడ్ తార‌లంతా అతిథులుగా వచ్చి సందడి చేయనున్నారు.

Two Much

ఇదిలాఉంటే.. ఇప్ప‌టికే క‌పిల్ శ‌ర్మ‌ షో, క‌ర‌ణ్ జోహార్ షో అంటూ నాలుగైదు షోలు హిందీలో ప్ర‌సార‌మ‌వుతూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా మంచి ఆద‌ర‌ణ‌ను సంపాదించుకున్న నేప‌థ్యంలో కొత్త‌గా వ‌స్తున్న ఈ కొత్త త‌ర‌హా షో ఎలాంటి రెస్పాన్స్ ద‌క్కించుకుంటుందో చూడాలి.

Updated Date - Sep 11 , 2025 | 06:05 PM