Ritu Varma: రీతూ వ‌ర్మ‌.. నువ్వు కూడానా! ఇంత షాకిచ్చావేంటి

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:48 AM

రీతూ వ‌ర్మ (Ritu Varma).. ఈ పేరు తెలియని, పరిచయం లేని తెలుగు ప్రేక్షకులు ఉండరు.

Ritu Varma

రీతూ వ‌ర్మ (Ritu Varma).. ఈ పేరు తెలియని, పరిచయం లేని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బాద్‌షా సినిమాలో కాజల్ స్నేహితురాలిగా కనిపించినా, ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సెకండ్ లీడ్ క్యారెక్టర్‌లో కనిపించి ఆలరించింది.

చివరికి ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో పోటీకి దిగింది. విజయ్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆశించినంతగా అవకాశాలు మాత్రం తలుపులు తట్టలేదు.

Ritu Varma

ఈ క్రమంలో తమిళంలో దుల్కర్ సల్మాన్‌, విశాల్ వంటి స్టార్లతో కూడా సినిమాలు చేసినా ఎక్కడా టాప్‌కు చేరుకోలేకపోయింది. ఇండస్ట్రీకి వచ్చి పుష్కరాలు దాటినా, నటించిన సినిమాలు కూడా డజన్ దాటలేదు. చేసిన అన్ని పాత్రల్లో పక్కింటి అమ్మాయి లాగా, నిండైన చీరకట్టులో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైంది. దీంతో సినిమాల సంఖ్యలో వెనుకబడింది. ఏడాదికి ఒకటి తప్పితే ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది.

Ritu Varma

గత సంవత్సరం స్వాగ్, ఈ సంవత్సరం సందీప్ కిషన్ – మజాకా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మాయమైంది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

ఈ నేపథ్యంలో కాలం గడిచేకొద్దీ అనేక మంది ముద్దుగుమ్మలు ‘రయ్’మంటూ ఎంట్రీ ఇవ్వడం, దేనికైనాసై అంటుండటం వల్ల పోటీ పెరిగి అవకాశాలు తగ్గిపోయాయి. ఇక చేసేదేమీ లేక రీతూ కూడా గ్లామర్ బాట పట్టక తప్పలేదు.

Ritu Varma

నిన్నమొన్నటి వరకు పక్కింటి అమ్మాయి, గర్ల్ నెక్స్ట్ డోర్‌లాగా కనిపించిన ఈ హైదరాబాద్‌ అమ్మాయి, ఉన్నపలంగా ఒక్కసారిగా తాను ఇప్పటివరకు కనిపించని విధంగా గ్లామర్ గేట్లు తెరిచి చేసిన ఫోటోషూట్ చూసిన ఆడియన్స్‌కు సడన్ షాక్ ఇచ్చింది. ఆ ఫోటోలు చూసిన వారంతా “ఏంటీ మనం చూస్తున్నది రీతూ వర్మనేనా? ఇలా మారిపోయిందేంటి?” అని ఖంగు తింటున్నారు. ఇప్పటికైనా అవకాశాలు రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Ritu Varma

Updated Date - Sep 12 , 2025 | 07:00 AM