CM Revanth Reddy: భారతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్
ABN, Publish Date - Aug 18 , 2025 | 07:10 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జాతీయ సినీ అవార్డు గ్రహీతలు సోమవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిశారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఫిల్మ్ అవార్డులలో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం కలిశారు. వారితో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 'భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ ను నిలపాల'ని అన్నారు. సినిమా రంగం ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతను అందిస్తానని హామీ ఇచ్చారు. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ళను సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం ఎ. రేవంత్ రెడ్డి అవార్డు గ్రహీతలైన 'భగవంత్ కేసరి' సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), 'హను-మాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma), ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్ కు సంబంధించి వెంకట్, శ్రీనివాస్, టీమ్ సభ్యులు, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, 'బేబి' సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్ (Sai Rajesh), సింగర్ రోహిత్ (Rohith) లను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో 'హను-మాన్' సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి; 'బేబి' సినిమా నిర్మాత ఎస్కేఎన్, 'భగవంత్ కేసరి' నిర్మాత గారపాటి సాహు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Kota Srinivasarao: కోట శ్రీనివాసరావు భార్య మృతి
Also Read: Girija: నాగార్జునతో రికార్డ్ లిప్ లాక్ పెట్టిన హీరోయిన్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందేంటి